సినిమా ఇండస్ట్రీలో తెరనేలిన, ఏలుతున్న చాలా మంది హీరోయిన్లను మేకప్ లేకుండా చూడటం కష్టమనే సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. మేకప్ లేకుంటే అసలు పోల్చుకోలేనంతగా ఉంటారు చాలా మంది నటీమణులు. తెరపై అత్యంత అందంగా వెలిగిపోయే హీరోయిన్లు, మేకప్ లేకపోతే వీళ్లు హీరోయిన్లేనా? అని ఆశ్చర్యపోయేంత రీతిలో కూడా ఉంటారు.
మేకప్ లేకుండా కూడా అప్సరసల్లాంటి రూపాన్ని కలిగిన హీరోయిన్లు తక్కువమందే. మేకప్ లేకుండా ఫొటోలు దిగే ధైర్యం కూడా చేయరు కొందరు హీరోయిన్లు. కానీ ఈ మధ్య కాలంలో నో మేకప్ ఫొటోలను పోస్టు చేయడం కూడా ఒక ట్రెండ్. అందులో భాగంగా కాదు కానీ, నటి సారా అలీఖాన్ తాజాగా మేకప్ రహిత పిక్ ఒకటి పోస్టు చేసింది.
సాయంత్ర వేళ టీ తాగుతూ ఆమె పోజునిచ్చింది. ఆ ఫొటోను ఇన్ స్టాలో పోస్టు చేసింది. మొహానికి మెరుగులు అద్దే, ఎత్తులూ పల్లాలను సరి చేసే మేకప్ ముచ్చటేదీ లేకుండా ఆమె ఈ ఫొటోను పోస్టు చేసింది.
అలాగే ఇన్ స్టాలో పోస్టు చేసే ఫొటోలకు చాలా మంది హీరోయిన్లు , హీరోలు ఫిల్టర్లు వాడుతూ ఉంటారు. అలంటి బలమైన ఫిల్టర్లు కూడా ఏవీ వాడినట్టుగా లేదు సారా. సహజమైన రూపాన్ని చూపుతూ, సాధారణ వస్త్రధారణతో సారా ఈ పిక్ తో తన ఫాలోయర్లను ఆకట్టుకుంటోంది. 12 లక్షలకు పైగా లైకులొచ్చాయి ఈ ఫొటోకి.