తమన్న గుండె పగిలింది, కారణం ఎవరు?

తన సోషల్ మీడియా పేజీల్లో తమన్న అప్పుడప్పుడు కవితలు రాస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం అక్కడే కాదు, అప్పుడప్పుడు పుస్తకంలో కూడా కవితలు రాస్తుంటుంది మిల్కీ బ్యూటీ. అయితే ఇలా కవితల రాయడం…

తన సోషల్ మీడియా పేజీల్లో తమన్న అప్పుడప్పుడు కవితలు రాస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం అక్కడే కాదు, అప్పుడప్పుడు పుస్తకంలో కూడా కవితలు రాస్తుంటుంది మిల్కీ బ్యూటీ. అయితే ఇలా కవితల రాయడం వెనక చాలా బాధ ఉందంటోంది ఈ బ్యూటీ.

ఆనందంగా ఉన్నప్పుడు కవితలు రాయదంట తమన్న. తనకు బాధ కలిగినప్పుడు మాత్రమే కవితలు రాస్తానంటోంది. గతంలో ఒకసారి తన గుండె పగిలిందని, అప్పట్నుంచి కవితలు రాస్తున్నానని చెప్పుకొచ్చింది.

చూస్తుంటే, తమన్న జీవితంలో ఏదో పెద్ద లవ్ ఫెయిల్యూర్ ఉన్నట్టుంది. అయితే ఆ విషయాన్ని తమన్న బయటపెట్టలేదు. తను కవయిత్రిగా మారడం వెనక కారణం ఏంటనే విషయాన్ని జస్ట్ టచ్ చేసి వదిలేసింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చూస్తుంటే తనకు గుండె పగిలిపోతుందని చెబుతోంది.

రీసెంట్ గా కరోనా బారిన పడిన ఈ హీరోయిన్, ఆ వివరాల్ని కూడా చెప్పుకొచ్చింది. హైదరాబాద్ లో ఓ వెబ్ మూవీ షూటింగ్ లో తనకు కరోనా సోకిందనే విషయాన్ని తమన్న ఖండిస్తోంది. 

బహుశా తనకు మంబయిలోనే వైరస్ సోకి ఉండొచ్చని, హైదరాబాద్ వచ్చి ఒక రోజు షూట్ చేసిన తర్వాత కరోనా లక్షణాలు బయటపడ్డాయని అంటోంది. తన మేనేజర్ సహకారంతో 14 రోజుల పాటు ఒంటరిగా హైదరాబాద్ లోనే క్వారంటైన్ లో ఉండిపోయానని చెప్పుకొచ్చింది.

Click Here For Photo Gallery

ఈ సెగ దేశం మొత్తానికి పాకుతుందా?