Advertisement

Advertisement


Home > Movies - Movie News

క్రికెట‌ర్ కూతురుకు.. సినిమా ఛాన్సులే నెక్ట్స్!

క్రికెట‌ర్ కూతురుకు.. సినిమా ఛాన్సులే నెక్ట్స్!

ఇప్ప‌టికే త‌న బ్యూటిఫుల్ లుక్స్, గ్లామ‌ర‌స్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సారా టెండూల్క‌ర్ కు ఇక సినీ ఆరంగేట్ర‌మే త‌రువాయిలాగుంది. మోడ‌లింగ్ డెబ్యూ ను పూర్తి చేసిన సారాకు బాలీవుడ్ అవ‌కాశాలు వెంట‌ప‌డేలా ఉన్నాయి. అస‌లే అక్క‌డ స్టార్ల వార‌సులకు సినీ అవ‌కాశాల విష‌యంలో చాలా ప్రాధాన్య‌త ఉంటోంది. ప్ర‌త్యేకించి హీరోయిన్ అవ‌కాశాల విష‌యంలో స్టార్ల పిల్ల‌ల‌కు మంచి ప్రాధాన్య‌తే కాదు, అవ‌కాశాలే వారి వెంట ప‌డుతూ ఉంటాయి. ఈ క్ర‌మంలో సారా టెండూల్క‌ర్ మీద కూడా బాలీవుడ్ చూపు ప‌డ‌టం ఖాయంలా ఉంది.

ప్ర‌త్యేకించి మోడల్ గా సారా కెరీర్ ప్రారంభించ‌డంతో.. ఆమె త‌దుప‌రి హీరోయిన్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తూ ఉంది. ఇన్నాళ్లూ సారా కేవ‌లం త‌న అంద‌మైన ఫొటోల‌ను మాత్ర‌మే పోస్టు చేసేది. వెకేష‌న్ల‌కు, బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు, ఫంక్ష‌న్ల‌లో దిగిన ఫొటోల‌ను పోస్టు చేసేది. ఇప్పుడు ఆమె ప్రొఫెష‌న‌ల్ మోడ‌ల్ గా అవ‌తారం ఎత్తింది. 

మోడ‌లింగ్ కు సూప‌ర్ లేటివ్ హీరోయిన్ కెరీరే. అందులోనూ బాలీవుడ్ లో బిగ్ ఫ్యామిలీస్ నుంచి వ‌చ్చిన అమ్మాయిలు హీరోయిన్లుగా కెరీర్ ను చూస్ చేసుకోవ‌డం రొటీనే. సచిన్ కు బాలీవుడ్ తో ఎలాంటి సంబంధం లేక‌పోయినా.. కేరాఫ్ ముంబై కావ‌డంతో, బాలీవుడ్ జ‌నాలతో మంచి స్నేహాలు అయితే ఉన్నాయి. ఈ క్ర‌మంలో సచిన్ ను ఒప్పించే సాన్నిహిత్యం కూడా బాలీవుడ్ సినీ జనాల‌కు ఉండొచ్చు.

ఇక కేవ‌లం మోడ‌లింగ్ విష‌యంలోనే కాకుండా.. కొన్నాళ్లుగా డేటింగ్ వార్త‌ల‌తో కూడా స‌చిన్ కూతురు నిలుస్తోంది. యంగ్ క్రికెట‌ర్ శుభ్ మ‌న్ గిల్ తో సారా డేటింగ్ లో ఉంద‌నే ప్ర‌చారం ఒక‌టి సాగుతూ ఉంది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ విష‌యంలో హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. ముంబై టెస్టులో గిల్ బ్యాటింగ్ స‌మ‌యంలో స‌చిన్, స‌చిన్ అంటూ  నిన‌దించ‌డంలో ఈ డేటింగ్  కూడా ఉంది. మొత్తానికి తండ్రికి భిన్న‌మైన కెరీర్, భిన్న‌మైన రీతిలో సారా.. వార్త‌ల్లో నిలుస్తోంది. క్రికెట‌ర్ కావాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్న సచిన్ త‌న‌యుడి క‌న్నా.. సారా మీదే అంద‌రి అటెన్ష‌న్ నిలుస్తోండ‌టం గ‌మ‌నార్హం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?