Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇన్నాళ్లకు రష్మిక గుర్తొచ్చింది

ఇన్నాళ్లకు రష్మిక గుర్తొచ్చింది

ఆమె అల్లాటప్పా హీరోయిన్ కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్. అలాంటి అమ్మాయిని సినిమాలో పెట్టుకొని ప్రచారంలో లేకుండా వదిలేశారు. చివరికి టీజర్ లో కూడా ఆమెకు చోటివ్వలేదు. ఇన్నాళ్లకు యూనిట్ కు రష్మిక గుర్తొచ్చినట్టుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి మహేష్-రష్మిక కాంబోలో 2 పోస్టర్లు వదిలారు.

నిజానికి రష్మిక కనిపించేలా గతంలో ఓ స్టిల్ రిలీజ్ చేసినప్పటికీ అది లిరికల్ వీడియోస్ లో భాగంగానే వచ్చింది. పైగా చుట్టూ క్యారెక్టర్ ఆర్టిస్టులతో పెద్ద గుంపు. మహేష్-రష్మిక జంటగా మాత్రం ఒక్కటంటే ఒక్క స్టిల్ కూడా రాలేదు. ఇన్నాళ్లకు ఆ ముచ్చట తీరింది.

సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ లో రష్మిక లేకపోవడంతో, ఆమెపై ఓ స్పెషల్ కట్ రిలీజ్ చేస్తారని అంతా భావించారు. మహేష్-రష్మిక కాంబోలో ఓ రొమాంటిక్ విజువల్ బయటకొచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ యూనిట్ మాత్రం ఆ దిశగా ఆలోచినట్టు కనిపించలేదు. బ్రాండ్ న్యూ పోస్టర్ అంటూ స్టిల్ రిలీజ్ చేసి ఊరుకున్నారు.

మరోవైపు సినిమాకు సంబంధించి విడుదల చేస్తున్న పాటలేవీ ఆకట్టుకోకపోవడంతో, యూనిట్ ప్లాన్ మార్చింది. కొన్నాళ్లపాటు సాంగ్స్ పక్కనపెట్టి.. కేరళలో ప్రత్యేకంగా షూట్ చేసిన ప్రమోషనల్ వీడియోస్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఓవైపు అల వైకుంఠపురములో టీజర్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, మరో పాట రిలీజ్ చేసి చేతులు కాల్చుకునేకంటే నేరుగా వీడియోస్ రిలీజ్ చేసి బజ్ పెంచాలని భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?