మహేష్ బాబు సర్కారు వారి పాట ట్రయిలర్ విడుదలయింది. చకచకా వైరల్ అయిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగుల పట్ల కాస్త అసంతృప్తి అక్కడక్కడా వినిపించినా, మొత్తం మీద ట్రయిలర్ అయితే ఒక ఊపు ఊపింది. టాలీవుడ్ పరిస్థితులు చూస్తుంటే సర్కారుకు కాలం కలిసి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. అవేంటో చూద్దాం.
ఓ పెద్ద హీరో ఎంటర్ టైన్ మెంట్ భారీ సినిమా విడుదలై కాస్త గట్టి గ్యాప్ నే వచ్చింది.
మహేష్ బాబు సినిమా విడుదలై రెండేళ్లు దాటిపోయింది.
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ సినిమాలు విడుదలై మాంచి విజయం సాధించినా వాటిల్లో ఎంటర్ టైన్ మెంట్ లేదు.
రాధేశ్యామ్ సినిమా అన్ని విధాలా ప్యాక్డ్ గా వస్తుంది అనుకుంటే విఫలమైంది.
భీమ్లా నాయక్ వచ్చినా పవర్ ఫుల్ సినిమాగా పేరు వచ్చింది కానీ ఎంటర్ టైనర్ కాలేదు.
దాంతో చాలా కాలంగా సరైన కమర్షియల్ హంగులతో సినిమా రానట్లు అయింది. ట్రయిలర్ లో ఆ ప్యాకేజ్ కనిపించింది.
మహేష్ బాబు కలర్ ఫుల్ లుక్స్ అన్నది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను పట్టేలాగే వున్నాయి.
అన్నింటికి మించి ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వచ్చి చాలా రోజులు అయిపోయంది. సరైన సినిమా కోసం ఆడియన్స్ వెయిటింగ్ లో వున్నారు. సమ్మర్ సీజన్, ఈ వెయిటింగ్ అన్నీ కలిసి సినిమాకు మాంచి ఓపెనింగ్స్ అయితే ఇస్తాయి.
కానీ కండిషన్ ఒక్కటే…
సినిమా మినిమమ్ కంటెంట్ వుండాలి. ఓకె టాక్ అయినా తెచ్చుకోవాలి. అదంతా దర్శకుడు పరుశురామ్ టాలెంట్ మీద ఆధారపడి వుంది.