గత కొంత కాలంగా శర్వానంద్ సినిమాలకు దూరంగా వువ్నారు. ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ ఒకే ఒక జీవితం ఈవారం విడుదల కాబోతోంది. అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఈ సినిమాలో శర్వా కు సపోర్ట్ గా వున్నారు. కాన్సెప్ట్ బాగుంది.
అయితే ఎంతో క్రేజ్, బజ్ వుంటే తప్ప ముందు రోజు స్పెషల్ ప్రీమియర్లు వేయడానికే ముందు వెనుక ఆడతారు సినిమా జనాలు. కానీ అలాంటిది శర్వా ఏకంగా మూడు రోజులు ముందుగానే సెలబ్రిటీ షో వేయించడం అంటే ఏమనుకోవాలి. సినిమా మీద వున్న కాన్ఫిడెన్స్ అనుకోవాలా? లేక సినిమాకు మరింత బజ్ తీసుకురావడం కోసం అనుకోవాలా?
ఒకే ఒక జీవితం సినిమా స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్ మంగళవారం రాత్రి వేసారు ఎక్కువగా టాలీవుడ్ దర్శకులు అంతా ఈ షోకి హాజరయ్యారు. దీని తరువాత మీడియాకు కూడా ఒక రోజు ముందుగానే షో వేయబోతున్నారు. మౌత్ టాక్, ప్రీ రిలీజ్ సెలబ్రిటీ టాక్ అన్నది సినిమాకు హెల్ప్ అవుతుంది. అది వాస్తవం. సినిమా చూసిన సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా అక్కౌంట్ల ద్వారా తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. అలా చేస్తే సినిమాకు మంచి బజ్ వస్తుంది.
కానీ సోషల్ మీడియా అక్కౌంట్ల సంగతి అలా వుంచితే పర్సనల్ టాక్ లేదా ఒపీనియన్ వేరుగా వుంటుంది. అది కనిపించకుండా, బయటకు వినిపించకుండా చాప కింద నీరులా పాకేస్తుంది. అది చాలా ప్రమాదం. ఇండస్ట్రీ సర్కిళ్ల నుంచి బయ్యర్ల సర్కిళ్లలోకి, అక్కడి నుంచి ప్రేక్షకుల లోకి వెళ్తుంది.
ప్రస్తుతానికి మాత్రం సెలబ్రిటీ షో అయి ఇంకా కొన్ని గంటలే అయింది. రిజల్డ్ ఎలా వుంటుంది అన్నది ఈ సాయంత్రానికి కానీ తెలియదు.