కెరీర్ పరంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో శర్వానంద్. చేతిలో ఫినిష్ అయిన సినిమా ఒకటి, స్టార్ట్ చేయాల్సిన సినిమా ఒకటి వున్నాయి.
కృష్ణ చైతన్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ నిర్మించే ఈ సినిమాలో హీరోయిన్ గా రాశీఖన్నాను ఫిక్స్ చేసారు. శర్వా-రాశీ కలిసి నటించడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం ఫిజిక్ ను తగ్గించుకునే పనిలో వున్నారు శర్వానంద్. ఇప్పటికే చాలా కిలోలు తగ్గి, కాస్త సన్నబడినట్లు తెలుస్తోంది. ఈ రీషేప్ వర్క్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది.
గతంలో నితిన్ తో పవర్ పేట సినిమా తీయాలనుకున్నారు కృష్ణ చైతన్య. కానీ అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అదో లేక అలాంటిదో సబ్జెక్ట్ తో శర్వానంద్ తో సినిమా చేయబోతున్నారు.
రాశీఖన్నా కెరీర్ మరీ సూపర్ గా లేదా అలా అని డల్ గా లేదు. చేతిలో సినిమాలు వుంటూనే వస్తున్నాయి. పక్కా కమర్షియల్ సినిమా విడుదలకు రెడీగా వుంది.