శాసనసభ..టైటిల్ గా

శాసనసభ అన్నది పవర్ ఫుల్ పదం. ఇదే పదాన్ని టైటిల్ గా తీసుకుని ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జర్నలిస్ట్ గా, పీఆర్వోగా టాలీవుడ్ లో వున్న రాఘవేంద్ర రెడ్డి కథ, మాటలు,…

శాసనసభ అన్నది పవర్ ఫుల్ పదం. ఇదే పదాన్ని టైటిల్ గా తీసుకుని ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జర్నలిస్ట్ గా, పీఆర్వోగా టాలీవుడ్ లో వున్న రాఘవేంద్ర రెడ్డి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తు ఈ సినిమాకు వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నారు. తులసీరామ్…షణ్ముగం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈ రోజు విడుదల చేసారు.

అసెంబ్లీ భవనం బ్యాక్ డ్రాప్ లో వుండగా శాసనసభ అనే లోగో రూపొందించారు. లోగోను, మోషన్ పోస్టర్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు. రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్ర లో నటిస్తున్న ఈ సినిమాతో ఇంద్రసేన్ హీరోగా పరిచయం అవతున్నాడు. సమకాలీన సమాజ పరిస్థితులకు అద్దం పట్టే కథను తీసుకుని, ఆడియన్స్ కు బలమైన మెసేజ్ ను అంతకన్నా బలంగా అందంచబోతున్నారు.

కేజిఎఫ్ సిరీస్ తో పాపులర్ అయిన రవి బసూర్ ఈ సినిమాతో తెలుగు రంగంలోకి అడుగుపెడుతున్నారు.ఈ సినిమా సబ్జెక్ట్ సమకాలీన రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే విధంగా వుండడంతో తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి కూడా అనువదించి విడుదల చేస్తున్నారు.

ఐశ్వర్య రాజ్ కథానాయక. సీనియర్ హీరోయిన్ సోనియా అగర్వాల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కృష్ణ మురళి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.