యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా సెబాస్టియన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మంగళవారం జరిగింది. ఈ ఫంక్షన్ లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..నాకు ఇండస్ట్రీలో ఒక అవకాశం విలువ ఏంటో తెలుసు. మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే వారిని ఎంతో బాగా చూసుకుంటాం.అలాంటింది మన కోసం థియేటర్స్ కు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి వినిమా చూసే ప్రేక్షకులను నిరాశ పరచకూడదని చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా తియ్యడం జరిగింది.ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులందరూ కూడా చాలా మంచి సినిమా చేశారని మెచ్చుకుంటారు.
రాజు, ప్రమోద్ అన్నలు మా సిద్దారెడ్డి మామ నాకెంతో సపోర్ట్ గా నిలిచారు.ఈ సినిమా ఆగి పోకూడదని చాలా కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాడు. తను నాకోసం తాను చాలా త్యాగాలు చేశాడు. నాకు సినిమా అంటే ఇష్టం. ప్రాణం దానిని గురించాడు మా అన్న. ఎక్కడో ఊర్లో టికెట్ కొనుకొని సినిమ చూసే నన్ను ఈ రోజు హీరో ను చేశాడు అని కిరణ్ అబ్బవరం బావోద్వేగాయానికి లోనైనాడు. తను ఈ రోజు మా మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది.తను కోరుకున్న విధంగానే నేను ఇంకా ఎక్కువగా కష్టపడి మంచి సినిమాలు చేస్తూ మంచిపేరు తీసుకువస్తాను.
ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే నేను తీసే ఏ సినిమా అయినా టీజర్, ట్రైలర్ లో నా కంటెంట్ నచ్చితేనే సినిమాకు రండి. ఇప్పుడు చేసిన సెబాస్టియన్ కూడా అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. అన్నారు.
ఇదే కార్యక్రమంలో చిత్ర దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన మీ అందరికీ ఎంత ఎంగేజింగ్ అనిపించిందో అంతకుమించి ఈ సినిమా ఉంటుంది. సినిమా చూసిన తరువాత నేను ఏదైతే రాసుకొన్నానో దానికి రెండింతలు ఎక్కువగా సినిమాలో కనిపించింది.
సినిమా ఇంత బాగా రావడానికి కారణం నా డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం అందరూ కూడా నిద్ర లేకుండా చాలా కష్టపడ్డారు వారందరికీ ధన్య వాదాలు. ఇప్పుడు చూసిన విజువల్స్ కంటే సినిమా చాలా బాగుంటుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఇది ఒరిజినల్ గా తీసినట్టు అనిపిస్తుంది.ప్రతి క్యారెక్టర్ కు డార్క్ షెడ్ ఉంటుంది.
అంతకుముందు ఈ కథను చాలా మందికి చెప్పాను. అందరూ కూడ కథను మార్పులు చేయమని చెప్పారు. అయితే కిరణ్ మాత్రం ఒక్క చేయింజ్ లేకుండా కథను ఒకే చేశాడు..జిబ్రాన్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్ అవుతుంది. ఇందులోని పాటలు చాలా బాగా వచ్చాయి. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన కిరణ్ కు , నిర్మాతలకు, ధన్యవాదాలు. ఈ నెల 4 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలని కోరుతున్నాను అన్నారు.