దివంగత వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ గా పచ్చమీడియా చేత చెప్పబడుతున్న అంశాలను టీడీపీ అప్పుడే అందిపుచ్చుకుంది. పచ్చమీడియా అచ్చేసినప్పుడే అది టీడీపీ వాడుకోవడానికి అని వేరే చెప్పనక్కర్లేదు.
టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిందే పచ్చమీడియాలో అచ్చవుతుంది, పచ్చ మీడియాలో అచ్చయినదే టీడీపీ ఆఫీసు నుంచి వస్తుందని తెలుగు వారికి తెలియనిది కాదు.
ఈ క్రమంలో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి స్టేట్ మెంట్ గా టీడీపీ అనుకూల మీడియాలో అచ్చు అయిన అంశం తాజాగా టీడీపీ ఏపీ విభాగం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. గత ఎన్నికల్లో జగన్ గెలవడానికి కారణం ఏమిటో అచ్చెన్న తేల్చారు. అదేమిటంటే..వైఎస్ వివేకానందరెడ్డి మురణం వల్ల వచ్చిన సానుభూతి అట!
వైఎస్ వివేక మరణిస్తే వచ్చే సానుభూతి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవొచ్చని జగన్ భావించారేమో అని నర్రెడ్డి సీబీఐతో అన్నాడని పచ్చమీడియా చెప్పగా, ఈ విషయాన్ని అచ్చెన్న ధ్రువీకరించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గడానికి కారణం వివేకానందరెడ్డి మరణమే.. అని అచ్చెన్న తేల్చి చెప్పారు!
'మాజీ మంత్రి వివేక హత్య వల్ల వచ్చిన సానుభూతితో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది..' అంటూ అచ్చెన్న టీడీపీ శ్రేణులకు సెలవిచ్చారు! మొత్తానికి గత ఎన్నికల ఫలితాల నుంచి టీడీపీ నేర్చుకున్నది ఇదనమాట!