సెబాస్టియన్..సెబా..రాజాధిరాజా

'రాజావారు రాణిగారు' సినిమాతో పరిచయమైన హీరో కిరణ్‌ అబ్బవరం. తొలి సినిమాతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. రెండో చిత్రం 'ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం'తో సక్సెస్‌ అందుకున్నారు. మార్చి 4న 'సెబాస్టియన్‌ పిసి 524'తో మరోసారి…

'రాజావారు రాణిగారు' సినిమాతో పరిచయమైన హీరో కిరణ్‌ అబ్బవరం. తొలి సినిమాతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. రెండో చిత్రం 'ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం'తో సక్సెస్‌ అందుకున్నారు. మార్చి 4న 'సెబాస్టియన్‌ పిసి 524'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సెబాస్టియన్‌'. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు.  జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో  సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు.

ఈ రోజు సినిమా నుంచి 'సెబా…' అనే సాంగ్ విడుదల చేశారు.

కంటిలోన చీకటిని, గుండెలోన దాచుకుని… వేదనలో వేడుకలా వెలుగు సెబా…రాజాధి రాజా!

వదిలిపోని వేకువని, తిరుగులేని రేపటిని…ఏలుకొనే ఏలికలా ఎదురు సెబా…రాజాధి రాజా!

– ఇలా చక్కటి సాహిత్యంతో, సినిమాలో కథానాయకుడి పరిస్థితి గురించి వివరిస్తూ 'సెబా…' పాట సాగింది.  

పాట విడుదల సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 'సెబాస్టియన్‌ పిసి524'తో కిరణ్ అబ్బవరం కచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుంటారు. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. 'హేలీ…' పాటలు మంచి స్పందన లభించింది. ఇప్పుడీ 'సెబా…' పాట సైతం విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంది. 

జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం. మార్చి 4వ తేదీన ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు” అని అన్నారు.