2022 లో ఇప్పటి వరకు దిల్ రాజు పట్టిన ప్రతి సినిమా దాదాపు బంగారమే. డబ్బులే డబ్బులు. అది ఆయన డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ స్టామినా. 2021 చివరలో విడుదలైన పుష్ప దగ్గర నుంచి చాలా సినిమాలు డబ్బులు గట్టిగా ఇచ్చాయి.
కొన్ని సినిమాలు డబ్బులు ఇవ్వకపోయినా, వెనక్కు జీఎస్టీ, ఇంకా ఏదో రూపంలో వెనక్కు వస్తాయి కనుక సేఫ్ అయ్యారు. కానీ ఫస్ట్ హాఫ్ అయిన దగ్గర నుంచి దెబ్బలు తగలడం ప్రారంభమైంది.
ముఖ్యంగా ప్రొడక్షన్ జెల్లలు గట్టిగా తగులుతున్నాయి. హిందీలో తీసిన రెండు సినిమాలు జెర్సీ, హిట్ ఫలితం ఇవ్వలేదు. పైగా కాస్త నష్టమే ఇచ్చాయి. ఎఫ్ 3 సినిమా మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు కానీ అవి అంతంత మాత్రమే ఫలించాయి. పంపిణీ దారుగా వారియర్ సినిమా కొంటే కాస్త చిన్న షాక్ ఇచ్చింది.
ఇప్పుడు థాంక్యూ అయితే మామూలు షాక్ ఇవ్వలేదు. ఈ షాక్ కాస్ట్ దాదాపు 15 కోట్ల వరకు వుంటుందని లెక్కలు వినిపిస్తున్నాయి. పాండమిక్ టైమ్ నిర్మాణం, ఖర్చు కాస్త ఎక్కువ కావడం అన్నీ కలిసి నాన్ థియేటర్ పోనూ, థియేటర్ మీద 18 కోట్ల వరకు బర్డెన్ వుంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదంతా పోయినట్లే.
ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2 ల పంపిణీ మీద మంచి లాభాలు సంపాదించారు. అవి చాలా వరకు ఈ సినిమా పట్టుకుపోయింది. అయితే పంపిణీ పరంగా దిల్ రాజుకు ఫరవాలేదు. కాంపిటీషన్ లేదు. అందువల్ల లాభాలు వస్తుంటాయి.
నిర్మాతగా కూడా రెండు భారీ సినిమాలు చేతిలో వున్నాయి. చరణ్ తో, విజయ్ తో. ఆ రెండు సినిమాలు హిట్ అయితే దిల్ ను ఎవ్వరూ ఆపలేరు.