పెళ్లి సంబంధాలనూ, కుదిరిన సంబంధాలకు ముహూర్తాలనూ రాశులను బట్టి నిర్ణయించే సంప్రదాయాలుంటాయి. రాశులను బట్టి జాతకాలను చెబుతూ ఉంటారు. జన్మఫలంతో మొదలుపెడితే, వారఫలాల వరకూ ఇలాంటి లెక్కలెన్నో ఉంటాయి! మరి ఇలాంటి రాశికీ శృంగార తత్వానికి కూడా సంబంధం ఉంటుందా? అనేది ఒక ఆసక్తిదాయకమైన అంశం!
వాస్తవానికి రాశులూ- జాతకాన్ని నమ్మే వాళ్ల సంఖ్య గట్టిగానే ఉంటుంది! వార్తాపత్రికల్లో వచ్చే రాశీ ఫలాలను పోటీ పడి చదివే వాళ్లు, ఉదయం లేవగానే టీవీల్లో రాశీ ఫలాలను వీక్షించే వారు బోలెడంత మంది ఉంటారు. వీటిని లైటర్ వెయిన్ లో నమ్మే వాళ్లు కొందరైతే, సీరియస్ గా నమ్మేసే వాళ్లు మరి కొందరు! నమ్మిన వాళ్లకు నమ్మినంత! నమ్మకాల సంగతలా ఉంటే.. ఇవి తెలుసుకోవడానికి సరదాగా ఉంటాయి. ఇలాంటి సరదా అంశాల్లో ఒకటే రాశికీ, శృంగారానికి సంబంధం ఉంటుందనేది! ఇంతకీ ఆ సంబంధం ఏమిటంటే!
-శృంగారం విషయంలో బాగా ఆసక్తి, ఎల్లవేలలా శృంగారానికి సన్నద్ధమైన స్థితిలో ఉంటారట వృశ్చిక రాశి వారు. వీరి శారీరక తత్వమే శృంగారానుకూలతను ఎల్లప్పుడూ కలిగి ఉంటుందట!
-మేషరాశి వారితో మధురానుభూతి దక్కడం ఖాయమట! బెడ్ షీట్ల మధ్యన వీరి సత్తా అంతా ఇంతా కాదట! స్త్రీ పురుషులెవరికైనా వర్తించే ఈ రాశీ ఫలాల ప్రకారం.. మేషరాశి వారు శృంగార వాంఛ, ఇంటెన్సిటీ విషయంలో ముందు వరసలో నిలుస్తారట. శృంగారంలో రాణించడం వారి డిక్షనరీలో ఉంటుందట. ఫోర్ ప్లే వంటి విషయాల్లో కూడా వీరిది అందె వేసిన చేయట!
-కర్కాటక రాశి వారు శృంగారాన్ని అస్వాధించడంలో పండి పోయి ఉంటారట. శృంగారంలో తృప్తిని ఎలా పొందాలో వీరికి బాగా ఎరుకట. ఇదే సమయంలో వీరు ఎమోషనల్. శృంగార బంధాన్ని కూడా ఎంతో ఎమోషనల్ గా తీసుకునే తత్వం వీరిది.
– మనిషికి గాలి, ఆహారం తీసుకోవడం ఎంత సహజమో.. వృషభరాశి వారికి శృంగారం అంత తేలికట. వీరు శృంగారం విషయంలో చాలా ప్యాషనేట్ గా ఉంటారట. మాటలతో కూడా మత్తెక్కించే విద్య వీరికి తెలిసి ఉంటుదట. ఓరల్ ప్లజర్ కావాలంటే వృషభరాశి వారితో గడపడమే పరిష్కారమట!
-మీన రాశి వారు రొమాంటిక్. వీరు శృంగారం విషయంలో చాలా ప్లాన్డ్ గా ఉంటారట.
-కన్యరాశి వారిని.. బెడ్రూమ్ లో కింగ్స్ అండ్ క్వీన్స్ గా అభివర్ణిస్తారు. వీరు సెక్సువల్ గా చాలా ఓపెన్ గా ఉంటారట. డర్టీ టాక్ తో మత్తెక్కించగల వారు వీరు!
-ఇక మిగతా రాశుల వాళ్లు కూడా శృంగారం విషయంలో ఫర్వాలేదు కానీ, మరీ అంత ప్రాధాన్యత ఉండదట. వీళ్లు శృంగారం విషయంలో మరీ డే డ్రీమర్స్ కాదంతే!