బిచ్చగాడు లుక్.. టైటిల్ మాత్రం కుబేర

ఇది నిజంగా బిగ్ సర్ ప్రైజ్. కమ్ముల సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ధనుష్ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా అలానే ఊహించారంతా. కానీ ఊహించని షాకిచ్చాడు శేఖర్ కమ్ముల. తన…

ఇది నిజంగా బిగ్ సర్ ప్రైజ్. కమ్ముల సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ధనుష్ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా అలానే ఊహించారంతా. కానీ ఊహించని షాకిచ్చాడు శేఖర్ కమ్ముల. తన కొత్త ప్రాజెక్టుకు కుబేర అనే టైటిల్ పెడుతూనే, వీడియోలో ఊహించని అంశాలు చూపించాడు.

ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కుబేర అనే టైటిల్ పెట్టారు. ఈ సందర్భంగా విడుదల చేసిన చిన్న వీడియోలో హీరో ధనుష్ ను చిరిగిన బట్టలతో బిచ్చగాడిలా చూపించారు.

ధనుష్ ను చిరిగిన దుస్తుల్లో, మాసిన గడ్డంలో చూపిస్తూనే.. అత్యంత ధనవంతుడైన దేవుడి పేరును ఈ సినిమాకు పెట్టడం అందర్లో ఆసక్తి రేకెత్తింది. అన్నపూర్ణ దేవి నుంచి పరమశివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటోను బ్యాక్ డ్రాప్ లో చూపించడం మరింత క్యూరియాసిటీ పెంచింది.

ఈ ఒక్క వీడియో, టైటిల్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఏమాటకామాట చెప్పుకోవాలి, ఈ చిన్న వీడియోకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది.

నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతిథి పాత్ర కంటే పెద్ద పాత్ర అది. ఇంకా చెప్పాలంటే దాదాపు మల్టీస్టారర్ మూవీ అనుకోవచ్చు. రష్మిక ఇందులో హీరోయిన్.