Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ నరేష్ కు ఏమైంది.. ఏంటీ మాటలు?

ఈ నరేష్ కు ఏమైంది.. ఏంటీ మాటలు?

సాధారణ జనం ట్విట్టర్ లో ఏం వాగినా పర్వాలేదు. కానీ సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తులు మాత్రం ఆచితూచి స్పందించాలి. మరీ ముఖ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. ఇంత సీనియారిటీ వచ్చినా 'సీనియర్' నరేష్ కు ఈ విషయం తెలియకపోవడం విడ్డూరం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే... "నా నమ్మకం ప్రకారం, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరగడానికి ముందు రక్తపాతం జరిగే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి."

సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన కామెంట్  కాదిది. ఎన్నికలకు మరో 40 రోజులు మాత్రమే టైమ్ ఉంది. కార్యకర్తలు అత్యంత సున్నితమైన పరిస్థితుల మధ్య ఉన్నారు. ఇలాంటి టైమ్ లో ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవసరమా? అసలు నరేష్ కు ఎందుకిదంతా?

ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కాదు. ఆయన మూలాలు ఏపీలో ఉండొచ్చు కానీ, ఆయనకు రాష్ట్రంలో ఓటు హక్కు కూడా లేదు. అలాంటప్పుడు ఆయన ఎందుకు మాట్లాడాలి? పోనీ మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మాట్లాడాడు అనుకుందాం? ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది?

గత ఎన్నికల సమయంలో వివేకా హత్య జరిగింది, కోడి కత్తి ఘటన అందరికీ తెలిసిందే. ఈ రెండూ కోర్టు పరిధిలో ఉన్నాయి. విచారణ సాగుతోంది. ఈసారి మరింత రక్తపాతం జరుగుతుందని నరేష్ చెప్పడంలో ఆంతర్యం ఏంటి? నిజంగా అంత నమ్మకంగా ఉంటే తన అనుమానాల్ని, సాక్ష్యాల్ని నేరుగా ఎన్నికల కమిషన్ లేదా పోలీసుల ముందు ఉంచొచ్చు కదా.. ఈ డొంక తిరుగుడు ట్వీట్ ఎందుకు?

ఈసారి ఎన్నికలకు సినీతారలు పూర్తిస్థాయిలో దూరంగా ఉండబోతున్నారు. గడిచిన ఐదేళ్లుగా జరిగిన పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. చివరికి పవన్ కల్యాణ్ తరఫున కూడా ప్రచారం చేసేందుకు తోటి మెగా హీరోలు ముందుకురాని పరిస్థితి. ఇలాంటి సెన్సిటివ్ టైమ్స్ లో నరేష్ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తన పెద్దరికానికి మచ్చ తెచ్చుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?