టాలీవుడ్ సీనియర్ నటుడు శివకృష్ణ 'రానా నాయుడు' వెబ్ సిరిస్ పై అసహనం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్య్ లో ఆయన మాట్లాడుతూ.. 'నిన్ననే ఓ వెబ్ సిరిస్ చూశాను. మరి దారుణంగా ఉంది. మొత్తం ఓ బ్లూ ఫిలింలాగా ఉంది. బెడ్ రూంలో జరగాల్సిన అంశాలను హాల్లో కూర్చున్న పిల్లలకు చూపించడం ఏంటి?' అంటూ మండిపడ్డారు.
ఈ మధ్యకాలంలో చాలా మంది యువత పాడైపోవడానికి ఇలాంటి ఓటీటీ సినిమాలు.. వెబ్ సిరిస్ లే కారణం అని అందుకే ఓటీటీలో కూడా సెన్సార్ ఉండాల్సిందన్నారు. 'నేను సెన్సార్ బోర్టు చైర్మన్ గా ఉన్నప్పుడే ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాను. ట్రైలర్స్ మొదలు అనువాద సినిమాల వరకూ సెన్సార్ జరుపుకునేలా చూడాలని లెటర్ కూడా పెట్టాను' అన్నారు.
రానా, వెంకటేష్ కలిసి చేసిన రానా నాయుడు వెబ్ సిరిస్ ఇటీవలే విడుదలైంది. సిరిస్ మొత్తం అడల్డ్ కంటెంట్ తో నెగిటీవ్ టాక్ వచ్చిన గ్లోబల్ టాప్ 10 సిరీస్ లిస్ట్‌లో స్థానం సంపాదించింది. ఇటీవల ఓటీటీలల్లో సెన్సార్ చేయలని డిమాండ్ పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ముందు ముందు ఓటీటీలను ఇలాగే వదిలేస్తే మరింత ప్రమాదకంగా సినిమాలు, సిరిస్ లు వచ్చే ప్రమాదం ఉంది.