టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కె.వాసు మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా 'ప్రాణం ఖరీదు' సినిమాకు దర్శకత్వం వహించింది వాసునే. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.
సీనియర్ దర్శకుడు కె. ప్రత్యగాత్మ కుమారుడే వాసు.. తండ్రి బాటలో సినిమా రంగం లోకి అడుగుపెట్టిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1982లో రత్న కుమారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు అన్నపూర్ణ, దీప్తి ఉన్నారు.
మొదటి సినిమా కృష్ణంరాజు హీరోగా ఆడపిల్లల తండ్రి అనే సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీషిరిడీ సాయిబాబా మహత్యం, అమెరికా అల్లుడు, అల్లుళ్లొస్తున్నారు, ఇంట్లో శ్రీమతి వీధిలోకుమారి వంటి సినిమాలు దర్శకత్వం వహించారు. 2008లో విడుదలైన గజిబిజి సినిమా తర్వాత వాసు దర్శకత్వానికి దూరంగా ఉన్నారు.