Advertisement

Advertisement


Home > Movies - Movie News

సిద్దార్ధ్ ‘ఊపిరే’ టక్కర్

సిద్దార్ధ్ ‘ఊపిరే’ టక్కర్

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ త్వరలో 'టక్కర్' అనే సినిమాతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'టక్కర్' మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన 'కయ్యాలే', 'పెదవులు వీడి మౌనం' అనే రెండు పాటలు కూడా విడుదలయ్యాయి . తాజాగా ఈ చిత్రం నుంచి 'ఊపిరే' అంటూ సాగే మూడో పాట విడుదలైంది.

ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా, కృష్ణకాంత్ అన్ని పాటలకు సాహిత్యం అందించారు. 'కయ్యాలే', 'పెదవులు వీడి మౌనం' పాటల మాదిరిగానే 'ఊపిరే' పాట కూడా ఆకట్టుకునేలా ఉంది. అభయ్ జోధ్‌పుర్కర్, సంజన కలమంజే ఈ పాటను ఆలపించారు. 

"సొగసే మా వీధి వైపు.. సరదాగా సాగెనే.. దిశలేమో నన్ను చూసి.. కను గీటెనే" అంటూ కథానాయికపై కథానాయుడికి ఉన్న ప్రేమను తెలిపేలా ఎంతో అందంగా ఉంది ఈ పాట. తేలిక పదాలతో లోతైన భావం పలికించారు కృష్ణకాంత్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?