రాను రాను ట్రెండ్ మారుతోందని, రైటర్లు మాత్రమే డైరక్టర్లు అవుతున్నట్లుగా కథను, సినిమా మేకింగ్ ను పక్కాగా జడ్ఙ్ చేయగలిగిన వారే హీరోగా నిలదొక్కుకోగలుగుతారని మైత్రీ మూవీస్ భాగస్వామి రవి అన్నారు.
సెబాస్టియన్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన అన్న ఈ మాటలు వాస్తవం కూడా. ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలు అంతా క్రాఫ్ట్ మీద పట్టు వున్నవారే కావడం విశేషం. సిద్దు జోన్నలగడ్డ స్కీన్ ప్లే, మాటలు రాయగలరు. అడవి శేష్ సంగతి తెలిసిందే.
నాని అసిస్టెంట్ డైరక్టర్ గా ప్రయాణం ప్రారంభించారు. నవీన్ పోలిశెట్టి ఆయన క్యారెక్టర్ కు ఆయనే మాటల రాసుకుంటారు. విశ్వక్ సేన్ లో కూడా రైటర్, డైరక్టర్ వున్నారు. కిరణ్ అబ్బవరం కూడా మాటల రచయితే. రాజ్ తరుణ్ కూడా కథలు రాస్తాడు.
నిర్మాత రవి అన్న మరోమాట కాబోయే టాలీవుడ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం అన్నది. అది కూడా నిజమే.రాజు గారు రాణీగారు ఒక్క సినిమాతో వచ్చి, ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు. వెంటనే ఇండస్ట్రీ స్మెల్ చేసేసింది. అందుకే గీతా, మైత్రీ మూవీస్ లో సినిమాలు ఫిక్స్ అయిపోయాయి.
నాని తరువాత అలా సింపుల్ గా ఏ బ్యాక్ గ్రవుండ్ లేకుండా వచ్చి, నిలదొక్కుకున్న హీరోగా కిరణ్ అబ్బవరం లైన్లోకి రాబోతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ టాలెంట్ సెర్చ్ లో సీరియస్ గా వుంది. బ్యాక్ గ్రవుండ్ అవసరం లేదు. టాలెంట్ ప్రూవ్ చేసుకోగలిగితే చాలు.
సిద్దు జొన్నలగడ్డ అలాగే ప్రూవ్ చేసుకున్నాడు. కొత్తగా ఏ బ్యాక్ గ్రవుండ్ లేకుండా వస్తున్న హీరోలు అంతా సినిమా క్రాఫ్ట్ ను, ప్రేక్షకుల టేస్ట్ ను, తమ లిమిటేషన్స్ ను అర్థం చేసుకుని మరీ రంగంలోకి దిగుతున్నారు.
అందువల్ల వారు తమకు నప్పే, ప్రేక్షకులు ఇష్టపడే విధంగా కథలను ఎంచుకుంటున్నారు. వీలయినంత డౌట్ టు ఎర్త్ గా వుంటున్నారు. వీళ్లంతా ఎక్కడా హీరోయిజం చూపించడం లేదు. అందువల్ల కామన్ ప్రేక్షకులు వీరిని ఓన్ చేసుకుంటున్నారు. బ్యాక్ గ్రవుండ్, రిలేషన్లతో వచ్చిన వారు ఓ మెట్టు పైన వున్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇది కామన్ ఆడియన్స్ కు అంతగా నచ్చడం లేదు.
మొత్తం మీద టాలీవుడ్ లో ట్రెండ్ మారుతోంది. అన్ని విధాలా టేలెంట్ హంట్ జరుగుతోంది. ఈ చాన్స్ అందిపుచ్చకోవడం అన్నది టాలెంట్ వున్న వాళ్ల పని.