సెంటిమెంట్ రిపీట్..రిపీట్

సినిమా జనాలకు సెంటిమెంట్లు ఎక్కువ. ఓ సినిమా హిట్ అయితే చాలు, చాలా వరకు రిపీట్ రిపీట్ అంటారు.  Advertisement అలవైకుంఠపురములో సినిమా టీమ్ లో హీరో తప్ప మిగిలినవారందరినీ అలాగే వుంచి, మహేష్…

సినిమా జనాలకు సెంటిమెంట్లు ఎక్కువ. ఓ సినిమా హిట్ అయితే చాలు, చాలా వరకు రిపీట్ రిపీట్ అంటారు. 

అలవైకుంఠపురములో సినిమా టీమ్ లో హీరో తప్ప మిగిలినవారందరినీ అలాగే వుంచి, మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు. చూడబోతుంటే బాలకృష్ణతో మైత్రీ నిర్మించే సినిమా వ్యవహారం కూడా ఇలాగే వుండేలా వుంది.

క్రాక్ సినిమా టెక్నికల్ టీమ్ మాగ్జిమమ్ బాలయ్య సినిమాకు కూడా పని చేయబోతోంది. ఇది చాలదన్నట్లు, క్రాక్ సినిమాలో విలన్ గా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ నే బాలయ్య సినిమాలో కూడా కీలకపాత్ర పోషించబోతోంది. అలాగే ఆ సినిమాలో కాస్తో కూస్తో నోటెడ్ పాత్రలు వేసిన చాలా మందిని బాలయ్య సినిమాలో రిపీట్ చేయబోతున్నట్లు బోగట్టా. 

దర్శకుడు మారుతి ఓ చిన్న సినిమా తీస్తున్నారు. దాని కోసం మహానుభావుడు సినిమాలో నటించిన మెహరీన్ ను రిపీట్ చేస్తున్నారు. చూస్తుంటే డైరక్టర్లు అంతా స్క్రిప్ట్ తో పాటు సెంటి మెంట్ ను కూడా కాస్త గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.