సెటిల్మెంట్ దిశగా ‘ఆచార్య’

దర్శకుడు కొరటాల శివ ఆది నుంచీ ఆచార్య బాధ్యతలు అన్నీ తనపై వేసుకున్నారు. ఆ విధంగానే ముందుకు వెళ్లారు. అప్పట్లోనే ఈ విషయం గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. నిర్మాత నిరంజ‌న్ రెడ్డి కొంత మొత్తం…

దర్శకుడు కొరటాల శివ ఆది నుంచీ ఆచార్య బాధ్యతలు అన్నీ తనపై వేసుకున్నారు. ఆ విధంగానే ముందుకు వెళ్లారు. అప్పట్లోనే ఈ విషయం గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. నిర్మాత నిరంజ‌న్ రెడ్డి కొంత మొత్తం తీసుకుని లాభ నష్టాలు అన్నీ కొరటాలకు వదిలేసారని అప్పట్లోనే బయటకు వచ్చింది. అంతే కాదు, కొణిదెల అన్న బ్యానర్ జ‌స్ట్ ఫర్ బ్యానర్ సేక్ అని కూడా అప్పట్లోనే వెల్లడయింది. అయితే సినిమా ఫలితం తరువాత నిర్మాత నిరంజ‌న్ రెడ్టి ఆ కనీసపు లాభం కూడా వదులుకున్నారని, వడ్డీలు ఆయనే భరించారని కూడా తెలుస్తోంది. ఇక ఇప్పుడు బయ్యర్లకు జీఎస్టీ కూడా భరించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే మరి బయ్యర్ల నష్టాల మాటేమిటి? గత రెండు రోజులుగా కొరటాల తన సన్నిహితులతో ఇదే విషయమై డిస్కషన్లు సాగిస్తున్నారు. వీలయినంత త్వరలో ఈ బరువు దించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా దించుకోవాలి అంటే కనీసం ముఫై కోట్లు అన్నా వెనక్కు ఇవ్వాల్సి వుంటుంది. తన మిత్రుడు సుధాకర్ డిస్ట్రిబ్యూట్ చేసిన కృష్ణా, గుంటూరు, వైజాగ్ ఏరియాల నుంచి కలెక్ట్ చేసిన థియేటర్ అడ్వాన్స్ ల సంగతి చూడాలి. అది ఒక పాయింట్.

ఎన్నాఎ ల పద్దతిన విక్రయించిన ఏరియాల బయ్యర్లకు ఇంతో అంతో వెనక్కు ఇవ్వాలి. ముఖ్యంగా నైజాం, సీడెడ్ ల విషయంలో కాస్త భారీ డెఫిసిట్ లు కనిపిస్తున్నాయి. గతంలో అజ్ఞాతవాసి సమయంలో నైజాం 28 కోట్ల మేరకు అమ్మితే తొమ్మిది కోట్ల మేరకు వెనక్కు ఇచ్చారు. ఇప్పుడు 37 కోట్ల మేరకు అమ్మారు. పదో, పన్నెండో రికవరీ వస్తోంది. మరి ఆ లెక్కన ఎంత వెనక్కు ఇవ్వాలి?

వెస్ట్, ఈస్ట్, నెల్లూరు ప్రాంతాల బయ్యర్లకు కూడా ఒకటి నుంచి రెండు కోట్లు, ఇంకా ఆ పైగా వెనక్కు ఇవ్వాల్సి వుంటుందని అంచనా. కర్ణాటక అడ్వాన్స్ మీద పంపిణీ చేసారు. అక్కడ ఓ మూడు కోట్లు అయినా వెనక్కు ఇవ్వాలి. ఓవర్ సీస్ లెక్కలు వుండనే వున్నాయి.

ఇలా అన్నీ కలిపితే దాదాపు 30 కోట్లు దాటేస్తున్నాయి. మరి కొరటాల ఇంత మొత్తం ఎక్కడి నుంచి ఇస్తారు? ఇదే ప్రశ్నకు ఆసక్తికరమైన లాజికల్ సమాధానం లభిస్తోంది. సినిమా నిర్మాణానికి 110 కోట్లు అయింది. వడ్డీలు 50 కోట్లు. మెగాస్టార్ అడ్వాన్స్ 10 కోట్లు. కొరటాల ఖర్చులు ఆరేడు కోట్లు. ఇలా అన్నీ కలిపి 170 కోట్ల వరకు లెక్క తేలుతోంది. సినిమా బిజినెస్ 210 కోట్ల వరకు చేసారు.

అంటే అక్కడ మిగులు 30 నుంచి 40 కోట్ల వరకు వుండి వుండాలి. అదే ఇప్పుడు వెనక్కు వెళ్లే అవకాశం వుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. లేదూ మెగాస్టార్ అడ్వాన్స్ కాకుండా మొత్తం రెమ్యూనిరేషన్ తీసేసుకుని వుంటారు అనుకుంటే, కొరటాల తో పాటు ఆయన కూడా ఏదైనా సర్దుబాటు చేయాల్సి వుంటుంది.