నిత్యం తనకు నీడను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపైనా, రాహుల్ గాంధీ కుటుంబంపైనా వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేస్తు వస్తున్నా అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ తాజాగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. షారుక్ ఖాన్ అంటే ఎవరో తెలియదని సెటైర్ వేశారు.
షారుక్ నటించిన పఠాన్ మూవీ ఈ వారంలో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ సందర్భంగా అస్సాంలోని సినిమా థియేటర్స్ పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడులు చేయడంపై సీఎం శర్మను మీడియా ప్రశ్నించాగా… షారుక్ ఖాన్ ఎవరో తెలియదని, అతను నటించిన సినిమా గురించి కూడా తనకేమి తెలియదని శర్మ అన్నారు.. అలాగే బాలీవుడ్ నుండి చాలా మంది ఫోన్ చేసీ సమస్యలు చెప్తుంటారు. కానీ షారుక్ నాకు ఫోన్ చేయలేదని.. ఒక వేళ అతను ఫోన్ చేసీ మాట్లాడితే అతను ఎవరో తెలుసుకునేందుకు ట్రై చేస్తా అంటూ సెటైర్ వేశారు.
పఠాన్ చిత్రంలోని ఒక పాటలో దీపికా పదుకొణె కాషాయ రంగు బికినీ ధరించడంతో బీజేపీ నాయకులు సినిమాపై మండిపడ్డారు. సినిమా విడుదలను అడ్డుకుంటాం అంటూ ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వివాదాస్పద సీన్లు కత్తిరించిన సినిమాపై మాత్రం దాడులు తగ్గడం లేదు. సినిమా విడుదలకు నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది. అప్పటికే గొడవ సర్దుమునుగుతుందా లేదా అనేది చూడాలి.