కుర్రాళ్ల కలలరాణి సాయిపల్లవి. చాలామందికి సాయిపల్లవి అంటే క్రష్. మరి ఇలాంటి అమ్మాయిని పడేయాలంటే ఏం చేయాలి? దీనికి రెండు షార్ట్ కట్స్ చెబుతున్నారు హీరోలు శర్వానంద్, అడివి శేష్.
ముందుగా శర్వానంద్ విషయానికొద్దాం. సాయిపల్లవితో కలిసి ఓ సినిమా చేశాడు శర్వా. ఆ అనుభవంతో సాయిపల్లవిని పడేయాలంటే ఓ షార్ట్ కట్ ఉందని చెబుతున్నాడు. సాయిపల్లవిని పిక్నిక్ లాంటి స్పాట్ కు తీసుకెళ్లాలంటే, ఆమెతో గుడికి వెళ్దామని అబద్ధం చెప్పాలంట. గుడి అంటే సాయిపల్లవి వచ్చేస్తుందట. కాబట్టి గుడికి వెళ్దామని చెబితే సాయిపల్లవి వచ్చేస్తుందని, తామిద్దరం కలిసి చాలా గుళ్లు తిరిగామని కూడా చెప్పుకొచ్చాడు.
మరో హీరో అడివి శేష్ మరోలా స్పందించాడు. సాయిపల్లవిని ఫ్లాట్ చేయాలంటే ఆమెకు మంచి కవితలు చెబితే సరిపోతుందంటున్నాడు ఈ హీరో. సాయిపల్లవితో తనకు కొంచెం పరిచయం ఉందని, ఆమెను ఇంప్రెస్ చేయాలంటే గాఢమైన కవితలు చెబితే సరిపోతుందని అన్నాడు.
బాలయ్యతో కలిసి ఈ ఇద్దరు హీరోలు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బాలకృష్ణ కుటుంబానికి శర్వానంద్ తాత ఛార్టర్డ్ ఎకౌంటెంట్ గా పనిచేశారట. తన ఆస్తుల వివరాలు అడిగితే, బాలయ్య ఆస్తుల వివరాల్ని జిరాక్స్ కాపీలతో సహా బయటపెడతానంటూ శర్వానంద్ బెదిరించడం కొసమెరుపు.