అంకుల్ అన్న పిలుపు…

అంకుల్..ఆంటీ అన్న పిలుపు ఈ మోడరన్ డేస్ లో చాలా అంటే చాలా కామన్. కానీ ఒక్కోసారి పైకి చెప్పకపోయినా లోలోపల అప్పుడే ఆంటీ అయిపోయానా? అప్పుడే అంకుల్ అయిపోయానా? అని అనుకోవడం చాలా…

అంకుల్..ఆంటీ అన్న పిలుపు ఈ మోడరన్ డేస్ లో చాలా అంటే చాలా కామన్. కానీ ఒక్కోసారి పైకి చెప్పకపోయినా లోలోపల అప్పుడే ఆంటీ అయిపోయానా? అప్పుడే అంకుల్ అయిపోయానా? అని అనుకోవడం చాలా మందికి కామన్. 

అన్నయ్యా అనో అక్కో అని పిలిస్తే బెటర్ కదా అని అనుకుంటారు. మెగాస్టార్ లాంటి 70 ఏళ్లకు దగ్గర పడిన వ్యక్తే తన మనవల చేత భయ్యా అని పిలిపించుకుంటున్నా అని చెప్పేసారు. ఆ మధ్యన యాంకర్, నటి అనసూయ ఆంటీ అనే వ్యవహారం వైరల్ అయింది.

ఇక కమింగ్ టు ద పాయింట్. ఆయన ఓ టాప్ సినిమా బ్యానర్ లో నిర్మాణ భాగస్వామి. వయసు నలభై నుంచి యాభైల మధ్యకు చేరుతోంది. కానీ అందరి చేత ‘లిటిల్ బ్రదర్’ అని పిలిపించుకోవడమే ఇష్టం. అందరి సంగతి ఎలా వున్నా ఓ అప్ కమింగ్ యంగ్ హీరో వున్నాడు. బాలనటుడిగా మొదలుపెట్టి హీరో దాకా వచ్చాడు. అతగాడు ఈ నిర్మాతను చూడగానే అంకుల్ అంటూ పలకరిస్తాడు. అదే ఇబ్బందిగా వుందట ఈ నిర్మాతకు.

‘వచ్చాడ్రా బాబూ…ఇప్పుడు అంకుల్ అంటాడు’ అని అంటున్నారట సదరు హీరో వస్తుంటే. అయినా ఈ మొహమాటం ఎందుకు..బ్రదర్..నన్ను బ్రదర్ అని పిలు చాలు అని చెప్పేయచ్చు కదా? ఎలాగూ ఈ నిర్మాతతో ఆ హీరోకే అవసరం కానీ ఇతగాడికి అతగాడితో కాదు కదా?