శర్వానంద్ కు ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ పూర్తయిన సంగతి తెలిసిందే. జనవరిలో శర్వా-రక్షిత నిశ్చితార్థం జరిగింది. ఆ ఈవెంట్ కు రామ్ చరణ్ తో పాటు పలువురు హీరోలు హాజరయ్యారు. ఇప్పుడీ హీరో పెళ్లికి రెడీ అయ్యాడు. వచ్చేనెల శర్వానంద్ పెళ్లి జరగనుంది.
ఇది కూడా డెస్టినేషన్ వెడ్డింగే. అలాఅని దేశం దాటి వెళ్లడం లేదు. జైపూర్ లో శర్వానంద్ పెళ్లి జరగనుంది. 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి, లీలా ప్యాలెస్ ను సెలక్ట్ చేశారు.
జూన్ 2న ప్యాలెస్ లో మెహందీ ఫంక్షన్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం సంగీత్ కూడా ఉంటుంది. ఇక మరుసటి రోజు, అంటే జూన్ 3న శర్వానంద్ ను పెళ్లికొడుకును చేస్తారు. ఆ రోజే రక్షిత మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు శర్వా.
రెండు కుటుంబాల మధ్య గుంభనంగా జరిగే పెళ్లి కాదిది. ఈ పెళ్లికి చాలామంది రాజకీయ, సినీ ప్రముఖుల్ని ఆహ్వానించింది శర్వా కుటుంబం. టాలీవుడ్ స్టార్స్ చాలామంది జైపూర్ వెళ్లబోతున్నారు.
కరోనా టైమ్ లో పెళ్లిళ్లు చేసుకున్న నిఖిల్, నితిన్, రానా లాంటి హీరోలు భారీ హంగామాను మిస్సయ్యాయి. శర్వానంద్ మాత్రం వాటికి విరుద్ధంగా గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నాడు. తెలిసినవాళ్లందర్నీ పెళ్లికి ఆహ్వానిస్తున్నాడు.