ఆ మూవీ ఆగింది.. ఈ మూవీ సైలెంట్ గా మొదలైంది

శర్వానంద్ ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాడు? తాజాగా అతడు కృష్ణచైతన్య దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు. కాబట్టి ఆ మూవీ షూటింగ్ లో ఉంటాడని ఎవరైనా అనుకుంటారు. కానీ శర్వా మాత్రం సైలంట్ గా…

శర్వానంద్ ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాడు? తాజాగా అతడు కృష్ణచైతన్య దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు. కాబట్టి ఆ మూవీ షూటింగ్ లో ఉంటాడని ఎవరైనా అనుకుంటారు. కానీ శర్వా మాత్రం సైలంట్ గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు. 

అవును.. శమంతకమణి, భలే మంచి రోజు, దేవదాస్ లాంటి సినిమాలు తీసిన శ్రీరామ్ ఆదిత్యకు అవకాశం ఇచ్చాడు శర్వానంద్. అంతేకాదు, సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు.

పీపుల్ మీడియా బ్యానర్ పై శర్వా- శ్రీరామ్ ఆదిత్య మూవీ షూటింగ్ నడుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా నడిచిపోతోంది.

మరి కృష్ణచైతన్య దర్శకత్వంలో శర్వానంద్ ఘనంగా స్టార్ట్ చేసిన సినిమా సంగతేంటి? ఆ సినిమా దాదాపు ఆగిపోయినట్టే. అలా కృష్ణచైతన్యకు మరోసారి ఆశాభంగం తప్పలేదు. ఇంతకుముందు నితిన్ కూడా ఈ దర్శకుడ్ని పక్కనపెట్టిన సంగతి తెలిసిందే.

మరోవైపు పెళ్లి ఏర్పాట్లతో కూడా బిజీగా ఉన్నాడు శర్వానంద్. రీసెంట్ గా అతడి ఎంగేజ్ మెంట్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సమ్మర్ లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ యంగ్ హీరో.