విషాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న క‌న్ను మూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటు రావ‌డంతో య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నా ఆయ‌న ఇవాళ తుది శ్వాస విడిచారు. గ‌త కొంతకాలంగా సాయ‌న్న కిడ్నీ సంబంధిత…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న క‌న్ను మూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటు రావ‌డంతో య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నా ఆయ‌న ఇవాళ తుది శ్వాస విడిచారు. గ‌త కొంతకాలంగా సాయ‌న్న కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ ప‌డుతున్నారు. ఆనారోగ్యం కార‌ణంగా గ‌త రెండు సంవత్సరాల నుండి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని  ప్రారంభించిన సాయ‌న్న.. 1994లో టీడీపీ అభ్యర్ధిగా తొలిసారిగా ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి నాలుగు దఫాలుగా టీడీపీ అభ్యర్ధిగా  విజయం సాధించారు. 2018 ముందు బీఆర్ఎస్ లోకి చేరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వివిధ పదువుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయమని కేసీఆర్ కొనియాడారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాయన్న ఆరుదైన ఘనత సాధించారని అన్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  అలాగే టీడీపీ అధినేత చంద్ర‌బాబు, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు త‌మ సంతాపాని వ్య‌క్తం చేశారు.