సినీ నటుడు నరేశ్, ఆయన మూడో భార్య రమ్య మధ్య గొడవ డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. త్వరలో పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇటీవల నరేశ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
నరేశ్, రమ్య మధ్య ఆర్థిక లావాదేవీలు, ఇతరత్రా అంశాలపై విమర్శలు, ప్రతివిమర్శల గురించి తెలిసిందే. ఆస్తి కోసం తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని, ఇంటి వద్ద రెక్కీ కూడా ఆమె చేయించిందని ఇటీవల నరేశ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి నరేశ్, రమ్య ఉదంతం చర్చనీయాంశమైంది. గచ్చిబౌలిలోని నరేశ్ ఇంటి వద్ద పార్క్ చేసిన కారుపై గుర్తు తెలియని దుండగలు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కారు ధ్వంస మైంది. ఈ పని తన మూడో భార్య రమ్య చేయించి వుంటుందని నరేశ్ ఆరోపణ. ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ప్రస్తుతం పోలీసులు కారును ధ్వంసం చేసిన దుండగుల ఆచూకీ కనుగొనే పనిలో ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. చివరికి పోలీసులు ఏం తెలుస్తారో అనే ఉత్కంఠ మాత్రం నెలకుంది. ఒకవైపు నరేశ్ నాలుగో పెళ్లి ఎప్పుడెప్పుడు చేసుకుందామా? అని ఆరాటపడుతున్నారు.
నరేశ్ పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వనని, విడాకులు ఇచ్చే ప్రశ్నే లేదని రమ్య భీష్మించారు. వీళ్లిద్దరి గొడవ ఇంకెంత కాలం ఇలా టీవీ సీరియల్‌ను తలపించేలా కొనసాగిస్తారో కాలమే జవాబు చెప్పాలి.