బాహుబలిలో శివగామి పాత్రతో అన్ని రకాల ప్రేక్షకుల్ని రమ్యకృష్ణ ఆకట్టుకున్నారు. రమ్యకృష్ణ అందుబాటులో ఉండి కూడా , ఆ పాత్ర కోసం మరెవరినో తెచ్చుకోవాలనే ఆలోచనకు దర్శకుడు రాజమౌళి చింతించిన విషయం తెలిసిందే. అలాగే హీరో ప్రభాస్ కూడా శివగామి పాత్రలో అద్భుతంగా నటించి , ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిన అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణపై ప్రశంసలు కురిపించారు.
బాహుబలిలో శివగామి పాత్రతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను రమ్యకృష్ణ గొప్పగా ప్రారంభించారనే చెప్పొచ్చు. కరోనా లాక్‌డౌన్ క్లిష్టపరిస్థితుల్లో ఆర్టిస్టులందరీ రెమ్యునరేషన్ తగ్గుతుంటే, రమ్యకృష్ణ పారితోషికం మాత్రం రెట్టింపు అయిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
తన పారితోషికాన్ని రెట్టింపు చేయడానికి ప్రధాన కారణం రాజమాత శివగామి లాంటి పవర్‌ఫుల్ పాత్రల్లో అద్భుతంగా నటించడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కాల్‌షీట్‌కు రూ.5 లక్షలు అందుకున్న రమ్యకృష్ణ… ఇప్పుడు రెట్టింపు మొత్తం అంటే రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలిసింది.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ చిత్రంలో హీరో తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇదే కాకుండా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమె బిజీగా ఉన్నట్టు చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.