షూటింగ్ ల బంద్ దిశగా టాలీవుడ్

టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ రోజు సమావేశం అయింది. సినిమాల పరిస్థితి మీద చర్చించింది. జనాలు థియేటర్లకు రాని పరిస్థితి, రాను రాను నిర్మాణ వ్యయం పెరిగిపోతున్న వైనం, కంట్రోల్ చేయలేని అసక్తత…

టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ రోజు సమావేశం అయింది. సినిమాల పరిస్థితి మీద చర్చించింది. జనాలు థియేటర్లకు రాని పరిస్థితి, రాను రాను నిర్మాణ వ్యయం పెరిగిపోతున్న వైనం, కంట్రోల్ చేయలేని అసక్తత ఇవన్నీ చర్చకు వచ్చాయి. 

మరోపక్కన సినిమా వర్కర్ల సమ్మె వ్యవహారం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీని మీద ఇప్పటికి నిర్మాణం ప్రారంభం కాని సినిమాలు షూటింగ్ లు ఆపాలన్న అభిప్రాయం వెల్లడయింది.

కానీ అలా కాదు, మొత్తం షూటింగ్ లు ఆపేయాలన్న సూచన వచ్చింది. ఎవరో సమ్మె చేస్తే సినిమాలు ఆగడం ఎందుకు? నిర్మాతలే సమ్మె చేస్తే సరి అన్న పాయింట్ పై చాలా వరకు ఏకాభిప్రాయం కుదిరింది. 

అప్పుడు కానీ నిర్మాణ వ్యయం కంట్రోల్ కాదని, నిర్మాత అన్నవాడు సినిమాలే తీయకపోతే పరిస్థితి ఏమిటని, నిర్మాత ఈ వ్యాపారం కాకపోతే మరో వ్యాపారం చేసుకుంటాడని, కానీ నటులు, ఇతరులు సినిమాలే చేయాల్సి వుంటుందని కొందరు అన్నారు.

క్యారెక్టర్ నటులు కూడా ఇష్టా రాజ్యంగా రేట్లు పెంచేస్తున్నారని, ఖర్చులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని ఇలాంటి నేపథ్యంలో కొన్నాళ్లు సినిమాల నిర్మాణం ఆపడం మాత్రమే పరిష్కారం అవుతుందని పలువరు గిల్డ్ సభ్యులు పేర్కొన్నారు. 

దీంతో నిర్మాణంలో వున్న సినిమాల నిర్మాతలు అందరినీ సమావేశ పర్చి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో ఆ సమావేశం జరుగుతుంది.