మ్యాగ్జిమం అందాల‌ను ఆర‌బోస్తున్న ఓటీటీ భామ‌!

ఎప్పుడో ద‌శాబ్దం, పుష్క‌ర కాలం క్రితం ఆమె సినిమాల్లో క‌నిపించింది. అది కూడా తెలుగు సినిమాల్లో. స‌క్సెస్ ల‌ను అందుకోలేక‌పోయినా.. త‌న అందంతో కొంత వ‌ర‌కూ గుర్తింపును సంపాదించింది. త‌న పేరే శ్రేయ ధ‌న్వంత‌రీ.…

ఎప్పుడో ద‌శాబ్దం, పుష్క‌ర కాలం క్రితం ఆమె సినిమాల్లో క‌నిపించింది. అది కూడా తెలుగు సినిమాల్లో. స‌క్సెస్ ల‌ను అందుకోలేక‌పోయినా.. త‌న అందంతో కొంత వ‌ర‌కూ గుర్తింపును సంపాదించింది. త‌న పేరే శ్రేయ ధ‌న్వంత‌రీ. జోష్ లో ఒక పాత్ర‌తో, స్నేహ‌గీతంలో హీరోయిన్ గా ఓ మోస్త‌రు గుర్తింపును సంపాదించుకుంది ఈమె. అలాగే అప్ప‌ట్లో టీవీ యాడ్స్ లో శ్రేయ క‌నిపించేది. 

అలా ద‌శాబ్దం క్రితం చాలా ప‌ద్ధ‌తి గ‌ల పాత్ర‌ల్లో క‌నిపించిన శ్రేయ కు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. అయితే ఆమెను హిందీ టీవీ షో లు ఉనికిలో నిల‌బెట్టాయి. ఇక ఇటీవ‌లి కాలంలో ఓటీటీ సీరిస్ ల‌లో శ్రేయ క‌నిపిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 92 వంటి సీరిస్ లు ఈమెకు మంచి గుర్తింపును ఇచ్చాయి. తెర‌మ‌రుగు అయ్యింద‌నుకున్న శ్రేయ ఇలా మ‌ళ్లీ లైమ్ లైట్లోకి వ‌చ్చింది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. గ‌త కొన్నాళ్లు త‌న ఇన్ స్టాగ్ర‌మ్ లో ఒక రేంజ్ లో రెచ్చిపోతోంది ఈ ధ‌న్వంత‌రి. బీచ్ ల నుంచి దిగిన ఫొటోల‌ను వ‌ర‌స పెట్టి పోస్టు చేస్తూ ఉంది. జారిపోతున్న బికినీల్లో ఈమె య‌మ హాట్ గా ఫొటోలు దిగి, క‌వ్వింపుతో కూడిన న‌వ్వుల‌తో ఫాలోయ‌ర్ల మ‌తి చెద‌ర‌గొట్టే పనిలో బిజీగా ఉంది ఈ న‌టీమ‌ణి. ఒక రోజు కాదు.. వ‌ర‌స పెట్టి మ్యాగ్జిమం అందాల‌ను ఆర‌బోస్తూ అద‌ర‌గొడుతోంది శ్రేయ‌.

ఈ పోజుల‌తో ఇన్ స్టాగ్ర‌మ్ ట్రెండింగ్ లో నిలుస్తోంది శ్రేయ‌. మ‌రి పోజులు ఈమెకు ఆ సోష‌ల్ మీడియాలో ఫాలోయ‌ర్ల‌ను పెంచ‌డం ఖాయ‌మే. మ‌రి సినిమా అవ‌కాశాలు ఏమైనా తెచ్చిపెడ‌తాయా? అనేదే కొశ్చ‌న్ మార్క్.