శ్రియ నుంచి మరో ఐటెంసాంగ్

17 ఏళ్ల కిందటే ఐటెంసాంగ్ చేసింది శ్రియ. అప్పట్నుంచి మినిమం గ్యాప్స్ లో ఆమె అలాంటి పాటలు చేస్తూనే ఉంది.

శ్రియకు ఐటెంసాంగ్స్ కొత్త కాదు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు, కెరీర్ డౌన్ అయినప్పుడు ఆమె ఎప్పటికప్పుడు ఐటెంసాంగ్స్ చేస్తూనే ఉంది. అయితే ఇప్పటికీ ఆమెకు అలాంటి ఆఫర్లు వస్తున్నాయి. అదే విచిత్రం.

తాజాగా శ్రియ మరో స్పెషల్ సాంగ్ చేసింది. సూర్య, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో తను ఐటెంసాంగ్ చేసినట్టు శ్రియ స్వయంగా ప్రకటించింది. వచ్చే నెల ఆ పాట విడుదలయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది.

ఆమె వయసిప్పుడు 42 ఏళ్లు. ఇప్పటికీ ఐటెంసాంగ్ ఆఫర్లు వస్తున్నాయంటే, ఆమె ఏ రేంజ్ లో ఫిజిక్ మెయింటైన్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

17 ఏళ్ల కిందటే ఐటెంసాంగ్ చేసింది శ్రియ. అప్పట్నుంచి మినిమం గ్యాప్స్ లో ఆమె అలాంటి పాటలు చేస్తూనే ఉంది. ఓవైపు ఇలా సాంగ్స్ చేస్తూనే, మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది.

23 ఏళ్ల నుంచి ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. త్వరలోనే తెలుగులో ఓ పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నట్టు కూడా వెల్లడించింది.

4 Replies to “శ్రియ నుంచి మరో ఐటెంసాంగ్”

Comments are closed.