జేసీ, ఆది మ‌ధ్య గొడ‌వ‌.. బాబు తెగ్గొడ‌తారా?

ఇప్ప‌టికే ఆర్టీపీపీలో ప్లైయాష్ త‌ర‌లింపున‌కు సంబంధించి గొడ‌వ‌కు గ‌ల కారాణాలు సీఎం బాబు తెప్పించుకున్నారు. ఇవాళ‌ ఏమ‌వుతుందో..

వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని ఆర్టీపీపీలో ప్లైయాష్ ర‌వాణా విష‌యంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మ‌ధ్య వివాదం త‌లెత్త‌డంతో వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయాయి. ఇక్క‌డి నుంచి వివిధ ప్రాంతాల్లోని సిమెంట్ ఫ్యాక్ట‌రీల‌కు ప్లైయాష్‌ను త‌ర‌లించే సంగ‌తి తెలిసిందే.

కూట‌మి నేత‌ల మ‌ధ్య గొడ‌వ కార‌ణంతా ప్లైయాష్‌ను లోడ్ చేసే ప‌రిస్థితి లేదు. చివ‌రికి పంచాయితీ సీఎం చంద్ర‌బాబునాయుడు వ‌ర‌కూ వెళ్లింది. ఇవాళ విజ‌య‌వాడ‌లో పంచాయితీ ఏ ర‌కంగా తెగుతుందో అనే ఉత్కంఠ నెల‌కుంది. నాలుగు రోజులుగా యాష్ పాండ్ వ‌ద్ద లారీలు, టిప్ప‌ర్లు, ట్యాంక‌ర్ల‌కు లోడింగ్ చేయ‌క‌పోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్ర‌తిరోజూ వంద‌లాది వాహ‌నాలు యాష్ పాండ్ త‌ర‌లించేవి. దీంతో అక్క‌డ వ్యాపారాలు బాగా జరిగేవి. నిత్యం జ‌న సంచారం వుండేది. నాయ‌కుల మ‌ధ్య పంతాలు, ప‌ట్టింపుల కార‌ణంగా ర‌వాణాపై ఆధార‌ప‌డి బ‌తుకుతున్న వారు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. రోజుల త‌ర‌బ‌డి అక్క‌డే ఎదురు చూడాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు. అధికారంలో ఉన్న నాయ‌కులు ప్లైయాష్‌ను త‌ర‌లిస్తూ ఆర్థికంగా సొమ్ము చేసుకునే సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు కూట‌మిలో మూడు పార్టీలు వుండ‌డంతో గొడ‌వ‌కు దారి తీసింది. ఇటు ఆది, అటు జేసీ ప‌ట్టుద‌లకు వెళ్లే నాయ‌కులు కావ‌డంతో ఎవ‌రూ చెప్పేవాళ్లు లేక‌పోయారు. సీఎం స్థాయిలో ఏదైనా జ‌రిగితే త‌ప్ప‌, ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించే అవ‌కాశం లేదు. ఇప్ప‌టికే ఆర్టీపీపీలో ప్లైయాష్ త‌ర‌లింపున‌కు సంబంధించి గొడ‌వ‌కు గ‌ల కారాణాలు సీఎం బాబు తెప్పించుకున్నారు. ఇవాళ‌ ఏమ‌వుతుందో చూద్దాం.

One Reply to “జేసీ, ఆది మ‌ధ్య గొడ‌వ‌.. బాబు తెగ్గొడ‌తారా?”

Comments are closed.