ఇంత వరకూ మెడిసిన్ సీట్లు పొందని విద్యార్థులకు మాత్రమే కొత్తగా దక్కిన 76 సీట్లను భర్తీ చేయాలని ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించడం విశేషం. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కోనసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు 25, నంద్యాల విశ్వభారతి మెడికల్ కాలేజీకి 50, అలాగే కర్నూలు మెడికల్ కాలేజీకి ఒక మెడిసిన్ సీటు ఇటీవల కన్వీనర్ కోటాలో దక్కాయి.
ఈ సీట్ల భర్తీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వింత నిర్ణయం తీసుకుంది. అసలు కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులతో మెరిట్‌తో సంబంధం లేకుండా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మెరిట్ విద్యార్థులు ఆందోళన చెందారు. మెడిసిన్ సీట్లు దక్కకపోవడంతో బీడీఎస్‌లో చేరిన విద్యార్థులున్నారు. ఇలాంటి వాళ్లంతా కోర్టును ఆశ్రయించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను నష్టం జరగకుండా సీట్లను భర్తీ చేయాలని హైకోర్టు సూచించింది.
ఇందులో భాగంగా మరోసారి ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటి వరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో కన్వీనర్, యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద సీట్లు కేటాయించని అభ్యర్థులందరినీ అనుమతిస్తూ ప్రత్యేక స్ట్రే కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ఆ 76 సీట్లకు మాత్రమే వర్తిస్తాయని న్యాయ స్థానం స్పష్టం చేసింది. ఈ సీట్ల భర్తీతో బీడీఎస్ విభాగంలో ఖాళీలు ఏర్పడుతాయి. దీంతో ఆ ఖాళీలను ప్రత్యేక స్ట్రే వేకెన్సీ రౌండ్ ద్వారా భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Call boy jobs available 7997531004