నాగార్జునపై, అతడి కుటుంబంపై, సమంతాపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ, అత్యంత వివాదాస్పదమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల్ని ఆమె వెనక్కు తీసుకున్నప్పటికీ, నాగార్జున మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆమెపై కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశాడు.
ఇప్పుడీ కేసు కీలక మలుపు తీసుకుంది. నాగార్జున పిటిషన్ ను కోర్టు కాగ్నిజెన్స్ లోకి తీసుకుంది. అంటే, సదరు కేసులో తప్పు జరిగిందనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. నాగ్ వేసిన పిటిషన్ ఆధారంగా, మంత్రికి సమన్లు జారీ చేయాలని ఆదేశించింది.
ఈ కేసుపై తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. అప్పటికే నోటీసులు జారీ చేయడంతో పాటు.. 12వ తేదీన తగు సమాధానంతో మంత్రి విచారణకు హాజరుకావాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
కేటీఆర్ ను విమర్శించే క్రమంలో నాగార్జున కుటుంబంపై, సమంతాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. దీనిపై నాగార్జున ఫైర్ అయ్యారు. ఆ వెంటనే సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు మంత్రి.
ఇదే విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో ప్రస్తావించగా.. నాగార్జున తరఫు లాయర్ దాన్ని తప్పుబడ్డారు. నాగార్జున కుటుంబం అనుభవించిన క్షోభ ముందు ఆమె క్షమాపణలు ఏపాటి అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, ఆమె పోస్టును కూడా జడ్జికి చదివి వినిపించారు. నాగ్ తరఫు లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించింది.
దీంతో పాటు గత నెల కోర్టు ముందుకు వ్యక్తిగతంగా హాజరై నాగార్జున, సుప్రియ, వెంకటేశ్వర్లు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ను కూడా పరిశీలించి కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.
9019471199వీడియో కాల్ అవకాశం కలదు
Call boy works 7997531004