హీరోయిన్లకు వ్యక్తిగత జీవితంలో బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇక సినిమాల్లో హీరోలకు పెట్టే లిప్ కిస్సుల్ని, వాళ్ల బాయ్ ఫ్రెండ్ చూస్తే పరిస్థితేంటి? మరీ ముఖ్యంగా ఇద్దరూ కలిసి కూర్చొని సినిమాలు చూడాల్సి వస్తే ఏంటి పరిస్థితి? ఈ ప్రశ్న హీరోయిన్ శృతిహాసన్ కు ఎదురైంది. తన బాయ్ ఫ్రెండ్ శంతనుకు తన సినిమాల్ని చూపించనంటోంది శృతిహాసన్. మరీ ముఖ్యంగా కలిసి సినిమా చూడాల్సి వస్తే మాత్రం అస్సలు ఆ ఛాన్స్ ఇవ్వనంటోంది.
“నేను నటించిన 2-3 సినిమాల్ని మేమిద్దరం కలిసి చూశాం. కానీ నిజం చెప్పాలంటే, కుదురుగా కూర్చొని నా సినిమాలు చూసే అవకాశం శంతనుకు ఇవ్వను. నేను నటించిన ఏ సినిమాని అతడు పూర్తిగా చూడలేదు. నా వర్క్ బాగుంటే మెచ్చుకుంటాడు. నేను కూడా అతడి వర్క్ ను మెచ్చుకుంటాను. సలహాలు ఇచ్చుకోవడం లాంటివి పెద్దగా జరగవు.”
ఇలా బాయ్ ఫ్రెండ్ తో కలిసి తను నటించిన సినిమాలు చూడనని చెప్పేసింది శృతిహాసన్. వర్క్ విషయానికొస్తే, ఒకరికొకరం మెచ్చుకోవడం తప్ప, సలహాలు ఇచ్చుకోవడం లాంటివి ఉండవంటోంది. డూడుల్ ఆర్టిస్ట్ శంతను వర్క్ లో తను వేలు పెట్టనంటోంది.
“నేను ప్రొఫెషనల్ ఆర్టిస్టును కాదు, పెయింటర్ ను కూడా కాదు. కనీసం డిజైనర్ ను కూడా కాదు. కాబట్టి అతడికి సలహాలు ఇచ్చేంత సీన్ లేదు. అతడు కూడా అంతే. నా యాక్టింగ్ పై సలహాలు ఇవ్వడు. ఇద్దరం మా పనులు మేం చేసుకుంటాం. ఖాళీ సమయాల్లో కలుసుకుంటాం.”
కెరీర్ స్టార్టింగ్ లో తన ప్రేమ వ్యవహారాల్ని బయటపెట్టడానికి ఇబ్బంది పడిందట శృతి. తర్వాత తనలో మెచ్యూరిటీ పెరిగిందని, వ్యక్తిగత విషయాల్ని కూడా షేర్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే లవ్ మేటర్ బయటపెట్టాలా వద్దా అనేది వ్యక్తిగతమని, ఈ విషయంలో ఇతర హీరోయిన్ల నిర్ణయాల్ని తను గౌరవిస్తానని అంటోంది.