“ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గించారు.. దీనిపై మీ స్పందన ఏంటి?” ఈ ప్రశ్నను డిస్ట్రిబ్యూటర్/ఎగ్జిబిటర్ లేదా నిర్మాతను అడిగితే బాగుంటుంది. ఇప్పటివరకు చాలామంది హీరోలు కూడా ఈ అంశంపై స్పందించే ధైర్యం చేయలేకపోయారు.
ఇలాంటి టైమ్ లో ఓ మీడియా సంస్థ, హీరోయిన్ శృతిహాసన్ ను ఈ ప్రశ్న అడిగింది. టిక్కెట్ రేట్లు తగ్గించడంపై స్పందించమని కోరింది. ఆ ప్రశ్న తనను ఎందుకు అడుగుతున్నారంటూ రివర్స్ లో ప్రశ్నించింది శృతిహాసన్.
“నిజాయితీగా చెబుతున్నాను.. నేను ప్రొడ్యూసర్ ను కాదు, కనీసం డిస్ట్రిబ్యూటర్ ను కూడా కాదు. కాబట్టి ఈ అంశంపై ఏదో ఒకటి చెప్పడం కరెక్ట్ కాదు. ఒకటి మాత్రం చెప్పగలను. ప్రస్తుత కరోనా/లాక్ డౌన్ పరిస్థితుల్లో మనమంతా మన శక్తి మేరకు పనిచేస్తున్నాం. కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది. దీంతో మన పోరాటం మరింత పెరిగింది. థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.. ఇలా అందరూ తమ పరిథిలో తమకు చేతనైనంత చేస్తున్నారు.”
ఇలా ఏపీలో టికెట్ రేట్లపై నర్మగర్బంగా స్పందించింది శృతిహాసన్. తన సినిమాలపై రియాక్ట్ అవుతూ.. సౌత్ లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్టు వెల్లడించిన ఈ హీరోయిన్.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కోసం మరో ఒరిజినల్ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించింది.
ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్న ఈ బ్యూటీ.. ఆ సినిమా షూటింగ్ చాలా కష్టంగా సాగుతోందని తెలిసింది. ఒకేసారి పలు భాషల్లో నటించాల్సి రావడం ఇబ్బందిగా ఉందంటోంది. షూటింగ్ పూర్తయిన తర్వాత వివిధ భాషల్లో తనే సొంతంగా డబ్బింగ్ కూడా చెబుతానంటోంది శృతి.