డిసెంబర్ నెలలో సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ సినిమా అన్ని విధాలా రెడీ అవుతోంది.
సినిమా ఫైనల్ కట్..రెండు గంటల యాభై ఆరు నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాల నిడివి ఎప్పుడూ ఎక్కువే వుంటుంది. అందులో సుకుమార్ సినిమాలు మరీనూ.
పుష్ప సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకోవడానికి కారణం కూడా కథకు ఆ స్పాన్ వుండడమే. అయినా కూడా తొలి భాగమే నాలుగు నిమషాల తక్కువ మూడు గంటలు రావడం విశేషం.
రష్మిక కథనాయిక గా నటించిన ఈ సినిమాలో భారీ తారాగణమే వుంది. ఫాజిల్, రావు రమేష్ , సునీల్, అజయ్ లాంటి నటులు వున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో కథ అల్లుకున్నారు.
శేషాచలం అడవుల్లో జరిగిన కథగా చూపించే ఈ సినిమాకు ఎక్కువ భాగం రంపచోడవం అడవుల్లో చిత్రీకరించారు. దేవీశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి