నాకు బ్రేక్ ఉండదు.. నేనే తీసుకుంటాను

తన కెరీర్ లో వస్తున్న గ్యాప్స్ పై మరోసారి స్పందించింది హీరోయిన్ శృతిహాసన్. తన కెరీర్ కు బ్రేక్ పడదని, తనే కావాలని గ్యాప్స్ తీసుకుంటానని చెబుతోంది. మోడల్, నటి, మ్యూజీషియన్, రచయిత, పెయింటర్…

తన కెరీర్ లో వస్తున్న గ్యాప్స్ పై మరోసారి స్పందించింది హీరోయిన్ శృతిహాసన్. తన కెరీర్ కు బ్రేక్ పడదని, తనే కావాలని గ్యాప్స్ తీసుకుంటానని చెబుతోంది. మోడల్, నటి, మ్యూజీషియన్, రచయిత, పెయింటర్ గా తను ఎప్పుడూ బిజీగా ఉంటానని.. ఒక్కో కోణంలో ఒక్కోసారి బ్రేక్ తీసుకుంటానని చెబుతోంది.

3-4 సినిమాల తర్వాత ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్ నుంచి మాయమవ్వడానికి అదే కారణమని చెబుతోంది. ఆ టైమ్ లో తనకు అవకాశాలొచ్చినా తీసుకోనని.. మ్యూజిక్ ప్రాజెక్టులు లేదా సెల్ఫ్-గోల్స్ కోసం టైమ్ తీసుకుంటానని చెబుతోంది.

తను చిన్న పాత్ర చేసినా ప్రేక్షకులు, తన క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారని చెబుతోంది శృతిహాసన్. ఇక కరోనా వల్ల ఇండస్ట్రీలో జనాలంతా తమ టార్గెట్ 2021 మాత్రమే అని చెబుతున్నారని, తను మాత్రం 2020లో కూడా వర్క్ చేసినట్టు చెబుతోంది. ఓ సింగిల్ రిలీజ్ చేశానని, త్వరలోనే ఓ కాన్సెప్ట్ బేస్డ్ ఆల్బమ్ కూడా రిలీజ్ చేస్తానని చెబుతోంది.

ఇక కరోనాపై స్పందిస్తూ.. కొంతమంది అసలు కరోనా లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారని, మరికొందరు ఇది కేవలం జలుబు లాంటిదేనని అనుకుంటున్నారని, అది సరైన పద్ధతి కాదని అంటోంది శృతిహాసన్. 

కరోనాతో కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధితుల్ని చూసైనా కొంతమంది మారాలని.. మన ఇగోలతో ప్రపంచాన్ని నియంత్రించాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందని, ప్రతి ఒక్కరు బాధ్యతగా, జాగ్రత్తగా మసులుకోవాలని చెబుతోంది.

బుద్ది లేని రాతలు