శ్యామ్ సింగ రాయ్..హీరో నాని చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్న సినిమా. నాని కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తయారైన సినిమా. నిర్మాత వెంకట్ బోయినపల్లి ఓ ఫ్యాషన్ తో నిర్మించిన సినిమా. దర్శకుడు రాహుల్ రెండో సినిమా. ఈ సినిమాకు విడుదలైన వెంటనే చాలా వరకు మంచి అప్లాజ్ నే వచ్చింది.
చూసిన వారంతా చాలా వరకు ఎగ్జయిట్ అయ్యారు. హీరో నాని ఆనందానికి అయితే అంతే లేదు. ఆంధ్రలో టికెట్ రేట్లు సరిగ్గా లేవు కనుక కలెక్షన్ల కనపడలేదు అని సరిపెట్టుకున్నారు ఆరంభంలో. విశాఖలో తొలి మూడు రోజులు కోటిన్నర వరకు వసూలు చేయడం చూసి, మూడు కోట్లకు పైగానే చేస్తుందని అంచనావేసారు అందరూ.
అలాగే నైజాంలో నాని గత సినిమాల రేంజ్ లో చేయకపోయినా, ఫరవాలేదు అనుకునే స్థాయిలోనే తొలి మూడు రోజులు చేసింది. దాంతో సినిమా స్టడీగా ముందుకు వెళ్తుందని భావించారు.
కానీ గమ్మత్తుగా సోమవారం నుంచి సినిమా చటుక్కున జారిపోయింది. వైజాగ్, నైజాం లాంటి క్లాస్ ఏరియాల సంగతి అలా వుంచితే ఈస్ట్ లాంటి మాస్ ఏరియాల్లో గట్టిగా 70 లక్షలు వసూలు చేయని పరిస్థితి. ఎందుకిలా? నాని క్రేజ్ కు ఏమయింది?
విభిన్నమైన మంచి పాత్రలు చేయాలనే నాని ప్రయత్నం జనాలకు నచ్చడం లేదా? లేక ఎంటర్ టైన్ మెంట్ వుంటేనే నాని సినిమా అని జనాలు ఫిక్స్ అయిపోయారా? మొత్తానికి ఏదో జరిగింది నాని మార్కెట్ కు ఆ సంగతి గమనించాల్సి వుంది.
కానీ కాస్తలో కాస్త ఊరడింపు ఏమిటంటే ఓవర్ సీస్ లో సినిమా ఓకె అనిపించుకోవడం. అమెరికా మార్కెట్ లో కాస్త మంచి వసూళ్లు కళ్లచూడడం. అది మాత్రమే నానికి ఆయన ఫ్యాన్స్ కు హ్యాపీ న్యూస్.