యువ హీరోల్లో కాస్త డిఫరెంట్ క్రేజ్ వున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. అలాగే విష్వక్ సేన్ కూడా. ఇప్పుడు ఈ ఇద్దరిని ఓ చోటకు తీసుకువచ్చి, ముచ్చటించబోతున్నారు నందమూరి బాలకృష్ణ.
తన చాట్ షో అన్ స్టాపబుల్ 2 కోసం. ఈ సీజన్ కోసం జంట జంటగా సినిమా, రాజకీయ జనాలతో ఎపిసోడ్ లు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు-లోకేష్ లతో ఎపిసోడ్ చేసారు. లేటెస్ట్ గా సిద్దు జొన్నలగడ్డ-విష్వక్ సేన్ లతో ఒక ఎపిసోడ్ చేస్తున్నారు.
ఈ ఎపిసోడ్ షూట్ ఈ రోజు అన్నపూర్ణలో చిత్రీకరిస్తున్నారు. అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ పెద్ద హిట్. కానీ చూస్తుంటే సెకెండ్ సీజన్ కు గెస్ట్ లు దొరకడం కష్టంగా వున్నట్లుంది. ఎన్టీఆర్…కళ్యాణ్ రామ్ లేదా ఎన్టీఆర్-కొరటాల, అలాగే మెగాస్టార్ లాంటి ఎపిసోడ్ లు చేయొచ్చు. కానీ వాటికి బాలయ్య సుముఖంగా లేరని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆ రెండింటిని ప్రస్తుతానికి పక్కన పెట్టారు.
నిజానికి బాలయ్య స్థాయికి మిడ్ రేంజ్ హీరోలను ఇంటర్వూ చేయడం ఏమిటో. ఈ లెక్కన వరుణ్-సాయిధరమ్ తేజ్…ఇలా ఎవరినైనా పిలిచి ఇంటర్వూ చేయొచ్చు. ఇక అదే చేస్తారేమో? గెస్ట్ లు దొరక్క.