పారితోషికం డబ్బులు కూడా రాలేదు

సికిందర్ కు అటుఇటుగా 120 కోట్లు రూపాయలు తీసుకున్నాడనే టాక్ ఉంది. అంటే, సల్మాన్ కు ఇచ్చిన పారితోషికం మేర కూడా కలెక్షన్లు రాలేదన్నమాట.

వందల కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే హీరోలు మన దగ్గర చాలామందున్నారు. అయితే అలా తీసుకున్న సినిమాలు ఆడకపోతే, రెమ్యూనరేషన్ డబ్బులు కూడా వెనక్కురావు. ఇది అలాంటి ఉదంతమే.

రంజాన్ కానుకగా విడుదలైన సికిందర్ సినిమా డిజాస్టర్ అయింది. దీనిపై మరో అభిప్రాయానికి తావులేదు. అయితే ఇప్పుడీ సినిమా ఫైనల్ కలెక్షన్ ఎంతనేది చర్చనీయాంశమైంది.

సికిందర్ సినిమా అటుఇటుగా వంద కోట్ల రూపాయల లోపే థియేట్రికల్ రన్ ముగించే అవకాశం ఉందంటోంది ట్రేడ్. అదే కనుక జరిగితే సల్మాన్ తీసుకున్న పారితోషికం కంటే ఈ వసూళ్లు తక్కువే.

తన సినిమాలకు సల్మాన్ వంద కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటాడు. సికిందర్ కు అటుఇటుగా 120 కోట్లు రూపాయలు తీసుకున్నాడనే టాక్ ఉంది. అంటే, సల్మాన్ కు ఇచ్చిన పారితోషికం మేర కూడా కలెక్షన్లు రాలేదన్నమాట.

మరోవైపు ఈ సినిమా కోసం చేసుకున్న అన్ని మల్టీప్లెక్స్ అగ్రిమెంట్లను రద్దు చేసుకొని, వీలైనంత త్వరగా ఓటీటీకి సినిమాను ఇచ్చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అలాగైనా కొంత రికవర్ అవ్వొచ్చనే ఆలోచన. అయితే మల్టీప్లెక్సులతో అగ్రిమెంట్లు రద్దు చేసుకోవడం అంత ఈజీ కాదనే విషయం తెలిసిందే.

One Reply to “పారితోషికం డబ్బులు కూడా రాలేదు”

Comments are closed.