వెండితెరపైనే కాదు, బుల్లితెరపై కూడా బన్నీకి తిరుగులేని రికార్డ్ ఉంది. అతడు నటించిన అల వైకుంఠపురములో సినిమా టీఆర్పీ రేటింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు అప్పట్లో ఏకంగా 29.4 రేటింగ్ వచ్చింది. టీఆర్పీల్లో ఇప్పటికీ ఈ సినిమాదే అగ్రస్థానం.
అల వైకుంఠపురములో సినిమా తర్వాత చాలా మూవీస్ వచ్చాయి. కానీ ఏ సినిమా దీన్ని దాటలేకపోయింది. ఒక దశలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బన్నీ మూవీని బీట్ చేస్తుందనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు.
మళ్లీ ఇన్నేళ్లకు మరో సినిమాపై అంచనాలు పెరిగాయి. అదే పుష్ప-2. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ, అల వైకుంఠపురములో సినిమాను క్రాస్ చేసి, టీఆర్పీల్లో కూడా నంబర్ వన్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఏ మేరకు సాధ్యమనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే, థియేటర్లలో హిట్టయిన సలార్, కల్కి, ధమాకా, వాల్తేరు వీరయ్య, విరూపాక్ష లాంటి ఎన్నో సినిమాలు బుల్లితెరపై ఫెయిలయ్యాయి.
తాజాగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం‘ సినిమా మాత్రం చాన్నాళ్ల తర్వాత స్మాల్ స్క్రీన్ పై మెరిసింది. దీంతో పుష్ప-2 కూడా రికార్డ్ టీఆర్పీ సాధిస్తుందని అంటున్నారు.
అటు ఈ సినిమా వైపు ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు సదరు ఛానెల్ కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది. టీవీల్లో పుష్ప-2 చూడండి, సినిమాలో బన్నీ నడిపిన కారును సొంతం చేసుకోండంటూ కాంటెస్ట్ పెట్టింది. స్టార్ మా ఛానెల్ కు ఈమధ్య వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. కోట్లు పెట్టి కొన్న సినిమాలన్నీ కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతున్నాయి.
పుష్ప-2 బుల్లితెరపై హిట్టవ్వడం, కేవలం ఆ ఛానెల్ కు మాత్రమే కాదు, మొత్తంగా శాటిలైట్ రైట్స్ మార్కెట్ కే చాలా కీలకం. ఈ సినిమా కూడా ఫెయిలైతే, ఈ మార్కెట్ మరింత పతనం చూడడం ఖాయం.
జాయిన్ అవ్వాలి అంటే
నో