పెద్ది – మళ్లీ పుడతామా ఏంటీ?

గ్లింప్స్ లో ఒక్క డైలాగ్ తో హీరో ఐడియాలజీ ఏమిటి అన్నది చెప్పారు.

ఇటీవలి కాలంలో బాగా ఎదురుచూసిన గ్లింప్స్..పెద్ది సినిమాదే. రామ్ చరణ్-బుచ్చిబాబు-సతీష్ కిలారు కాంబినేషన్ సినిమా. ఈ సినిమా గ్లింప్స్ ఉగాదికే వస్తుంది అనుకున్నారు. కానీ వర్క్ కాలేదు. శ్రీరామనవమికి వచ్చింది. నిమిషం నిడివికి కాస్త పైగా వున్న గ్లింప్స్ సినిమా జానర్ ను, సినిమా విడుదల తేదీని, టైటిల్ ను అనౌన్స్ చేసింది. అందరూ అనుకుంటున్నట్లే క్రికెట్ నేపథ్యంలో.. ఓ కామన్ మాన్ కథను చెబుతున్నారు.

రఫ్ లుక్.. రఫ్ బ్యాక్ గ్రవుండ్ లో సినిమా వుంటుందని క్లారిటీ ఇచ్చారు. అంతకు మించి వచ్చే ఏడాది మార్చి 27న విడుదల అని ప్రకటించారు. దానికి ఒక రోజు తేడాగా నాని పారడైజ్ విడుదల కాబోతోంది. అది వేరే సంగతి.

గ్లింప్స్ లో ఒక్క డైలాగ్ తో హీరో ఐడియాలజీ ఏమిటి అన్నది చెప్పారు. అనుకున్నపుడే చేసేయాలి. భూమ్మీద వున్నపుడే చేసేయాలి మళ్లీ జన్మ వుంటుందా అన్నది హీరో పాత్ర ఐడియాలజీ. దాన్ని ఉత్తరాంధ్ర యాస స్టైల్ లో చరణ్ చేత చెప్పించారు. తండేల్ సినిమా తరువాత మళ్లీ ఉత్తరాంధ్ర యాస వాడుతూ వస్తున్న పెద్ద సినిమా ఇది. చరణ్ లుక్ మరీ రఫ్ గా వుంది. మరీ ఎందుకంత రఫ్.. జస్ట్ పల్లెటూరు నేపథ్యంలో అంత రఫ్ లుక్ ఎందుకున్నది దర్శకుడు బుచ్చిబాబుకే తెలియాలి.

రెహమాన్ స్కోర్ బాగానే వుంది. మొత్తం మీద గ్లింప్స్ మెగా ఫ్యాన్స్ కు ఊపు తెచ్చేలాగే వుంది తప్ప నిరాశపర్చేమాదిరిగా అయితే లేదు.

7 Replies to “పెద్ది – మళ్లీ పుడతామా ఏంటీ?”

Comments are closed.