కొన్ని కొన్ని కాంబినేషన్లకు ఓటీటీ, డిజిటల్ రైట్సే కావాల్సినంత డబ్బును సమకూర్చి పెడుతూ ఉన్నాయి. ప్రతి సినిమాకూ ఇదే జరుగుతుందనుకోవడం భ్రమ కానీ.. స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటివి కలిసి వస్తూ ఉన్నాయి. క్రేజీ కాంబినేషన్లకు తోడు, హీరోల ఇమేజ్ తో కొన్ని సినిమాలు ఇలా లాభపడుతూ ఉన్నాయి. మురుగదాస్ డైరెక్షన్లో, సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న సికిందర్ అనే సినిమా ఇలానే లాభపడుతూ ఉంది.
గత కొన్నాళ్లు సల్మాన్ ఖాన్ సినిమాలు అద్భుతాలు ఏమీ చేయడం లేదు. అయితే ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ ద్వారానే ఏకంగా 80 శాతం రికవరీ సాధ్యం అవుతోందట. ఈ సినిమాను విడుదలకు ముందే ఓటీటీ రైట్స్ అమ్మారు. ఏకంగా 85 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను పొందిందట నెట్ ఫ్లిక్స్. ఒకవేళ ఈ సినిమా 350 కోట్ల రూపాయలు, అంతకు మించి థియేటరికల్ వసూళ్లను రాబడితే.. ఆ సంస్థ ఇంకో 15 కోట్ల రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందట! కనీసం 85 కోట్ల రూపాయలను అనుకుంటే, దానికి అదనంగా మ్యూజిక్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయట.
ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ను జీ మ్యూజిక్ కంపెనీ ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడమే కాకుండా, టీవీ రైట్స్ ను కూడా జీ నెట్ వర్క్ సొంతం చేసుకుందట యాభై కోట్ల రూపాయలను వెచ్చించి! ఇలా మ్యూజిక్, టీవీ రైట్స్ రూపంలో ఏకంగా 80 కోట్ల రూపాయలు సొంతం చేసుకుందట ఈ సినిమా. ఇలా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారానే 165 కోట్ల రూపాయలు దక్కిందట!
మరి ఈ సినిమా బడ్జెట్ కూడా అతి భారీ స్థాయిలో లేకపోవడం అడ్వాంటేజ్. మరీ నాలుగు వందల కోట్లు, ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే.. ఇలా వచ్చే 165 కోట్ల రూపాయలు కూడా ఒక మూలకు సరిపోవు. ఈ సినిమాకు సల్మాన్ పారితోషికాన్ని పక్కన పెడితే.. మొత్తంగా బడ్జెట్ రెండు వందల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా.
మరి రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కు ఇలా అటు ఇటుగా 80 శాతం డబ్బు డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారానే సమకూరుతున్నట్టుగా ఉంది. ఎలాగూ థియేటరికల్ రైట్స్ విషయంలో ఓపెనింగ్స్ కు కొదవ ఉండదు. బాలీవుడ్ లో దక్షిణాది దర్శకుల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్న కాలం ఇది. దీంతో ఈ సినిమాకు అలాంటి ఇబ్బంది కూడా లేదు! స్థూలంగా సల్మాన్ కు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సేఫెస్ట్ వెంచర్ అవుతోంది!
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Abbo