45 రోజుల్లో 30 కోట్లు సాధించడం సాధ్యమేనా? లాటరీ తగిలితే మాత్రమే సాధ్యం లేదా అంబానీ-అదానీ లాంటి వ్యాపారవేత్తలకు మాత్రమే సాధ్యం. కానీ పడవ నడిపేవాడు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. 45 రోజుల్లో 30 కోట్లు సంపాదించి చూపెట్టాడు. అయితే ఈ విజయం అంత సులభంగా అతడికి దక్కలేదు. ఆ కథేంటో చూద్దాం..
బోట్ ఆపరేటర్ పింటూ మహారాకు తన వ్యాపారం కొత్తకాదు. అయితే తన బిజినెస్ లో ఎన్నడూ చూడని పెద్ద అవకాశాన్ని అతడు చూశాడు. అదే మహా కుంభమేళా. ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో పడవలు నడిపితే మంచి ఆదాయం వస్తుందనే విషయాన్ని అతడు 2019లో జరిగిన అర్థకుంభమేళాలోనే తెలుసుకున్నాడు. ఈసారి పూర్తిస్థాయిలో సాహసం చేశాడు.
ఎంతలా అంటే పడవల కోసం తన ఆస్తి మొత్తం తాకట్టు పెట్టాడు. ఇంట్లో బంగారం మొత్తం అమ్మేశాడు. లెక్కలేనన్ని అప్పులు చేశాడు. అలా వచ్చిన డబ్బుతో కుంభమేళాలో 70 పడవలు పెట్టాడు. వాటిని నడపడానికి 250 మందిని తీసుకున్నాడు. అలా ఆత్మవిశ్వాసంతో ముందుకు దూకాడు. అతడి ఆత్మవిశ్వాసం నిలబడింది. కుంభమేళా నుంచి అతడు 30 కోట్ల రూపాయలు ఆర్జించాడు.
కుంభమేళాకు వచ్చిన భక్తులను త్రివేణి సంగమం వద్దకు తీసుకెళ్లడం, తిరిగి ఒడ్డుకు తీసుకురావడం, వాళ్లకు రూమ్స్ ఇవ్వడం లాంటి పనులతో పింటూ మహారా 45 రోజుల్లో అక్షరాలా 30 కోట్లు సంపాదించాడు. దీని కోసం అతడు రాత్రిపగలు కష్టపడ్డాడు. సోదరులతో పాటు తన కుటుంబం మొత్తాన్ని కుంభమేళాలో పెట్టాడు. 250 మంది సిబ్బందికి మంచి జీతాలిచ్చాడు. వాళ్లకు కావాల్సిన వసతి చూశాడు. మధ్యలో చాలామంది జబ్బుపడ్డారు. వాళ్లను చూసుకుంటూ పింటూ తన పని కొనసాగించాడు.
అలా ప్రతి పడవ నుంచి రోజుకు 50వేల రూపాయలు ఆర్జించాడు. ఒక్కో పడవ అతడికి 23 లక్షల రూపాయలు ఆర్జించింది. ఫలితంగా 30 కోట్లు కళ్లజూశాడు. అప్పులన్నీ తీర్చేశాడు, ఆస్తులు వెనక్కు తెచ్చుకున్నాడు, సిబ్బందికి భారీగా జీతాలిచ్చాడు. ఇప్పుడు 70 పడవలకు ఓనర్ అయ్యాడు. తన కష్టానికి గంగమ్మ ఆశీస్సులు తోడయ్యాయంటాడు పింటూ.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Congress
best entrepreneur award goes to…..
కష్టేఫలి
Brilliant, he foresaw the opportunity, took risk and become rich..