తోడ‌ల్లుళ్లు క‌లుసుకున్నారు.. తోడ‌బుట్టినోళ్లు కొట్టుకుంటున్నారు!

బాబులో ఏ మాత్రం మార్పురాలేదు. బాబుపై మారింద‌ల్లా వెంక‌టేశ్వ‌ర‌రావే.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, మాజీ ఎంపీ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు దివంగ‌త ఎన్టీఆర్‌కు అల్లుళ్లు. అయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రి మ‌న‌స్త‌త్వాల్లో ఎంతో తేడా. రాజ‌కీయంగా ఇద్ద‌రూ క‌త్తులు దూసుకున్నారు. 1995లో ఎన్టీఆర్‌ను సీఎంగా గ‌ద్దె దించ‌డంలో ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌తుర‌త అది. త‌న‌ను తిట్టినోళ్ల‌తోనే సీఎంగా ఆమోద ముద్ర‌ వేయించుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. త‌న భార్య ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి వారిస్తున్నా, ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబుతో చేతులు క‌లిపిన‌ట్టు ప‌లు సంద‌ర్భాల్లో వెంక‌టేశ్వ‌ర‌రావు ప‌శ్చాత్తాపం చెందారు.

మూడు ద‌శాబ్దాల త‌ర్వాత తోడ‌ల్లుళ్లు ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు రాసిన ప్ర‌పంచ చ‌రిత్ర పుస్త‌కావిష్క‌ర‌ణ‌కు ముఖ్య అతిథిగా చంద్ర‌బాబు వెళ్ల‌డం విశేషం. ఇదే వెంక‌టేశ్వ‌ర‌రావు తాను బాబు చేతిలో మోస‌పోయాన‌నే ఆవేద‌న‌తో, భావి త‌రాల‌కు తోడ‌ల్లుడి మోస చ‌రిత్ర తెలియాల‌ని ఆకాంక్షించారు. అందుకే బాబు వంచ‌న గురించి…చ‌రిత్ర -కొన్ని నిజాలు పేరుతో పుస్త‌కం రాశారు. బాబు చ‌రిత్ర‌-ప్ర‌పంచ చ‌రిత్ర మ‌ధ్య మారిన ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు.

ఇక్క‌డ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే….బాబులో ఏ మాత్రం మార్పురాలేదు. బాబుపై మారింద‌ల్లా వెంక‌టేశ్వ‌ర‌రావే. బ‌హుశా త‌న వార‌సుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ద‌గ్గుబాటిలో మార్పు వ‌చ్చి వుండొచ్చు. ప్ర‌పంచ చ‌రిత్ర పుస్త‌కావిష్క‌ర‌ణ‌ వేదిక‌పై చంద్ర‌బాబు, వెంక‌టేశ్వ‌ర‌రావు ముచ్చ‌ట్లాడారు. మూడు ద‌శాబ్దాల త‌ర్వాత ఎన్టీఆర్ ఇద్ద‌రు అల్లుళ్లు అల‌య్ బ‌ల‌య్ అంటూ ఆలింగ‌నం చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇదే సంద‌ర్భంలో తోడ‌బుట్టిన అన్నాచెల్లెలు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ష‌ర్మిల వ్య‌క్తిగ‌తంగా తీవ్రంగా విభేదించుకోవ‌డం తెర‌పైకి వ‌చ్చింది. వైఎస్సార్ ర‌క్తం పంచుకుని పుట్టిన జ‌గ‌న్‌, ష‌ర్మిల ప‌ర‌స్ప‌రం కొట్టుకుంటూ, రాజ‌కీయంగా న‌ష్ట‌పోవ‌డాన్ని ప్ర‌త్యేకంగా చ‌ర్చించుకుంటున్నారు. ర‌క్తం పంచుకుని పుట్ట‌క‌పోయినా… రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి చంద్ర‌బాబు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు పాలునీళ్ల‌లా క‌లిసిపోయార‌ని, వాళ్ల‌ను చూసైనా అన్నాచెల్లెలు బుద్ధి తెచ్చుకోవాల‌ని వైఎస్సార్ అభిమానులు హిత‌వు చెబుతున్నారు.

అన్నాచెల్లెలి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల్సిన త‌ల్లి విజ‌య‌మ్మ‌… ఒక ప‌క్షం వ‌హించ‌డం గురించి జ‌నం మాట్లాడుకుంటున్నారు. అంద‌రూ క‌లిసి వైఎస్సార్‌కు, ఆయ‌న అభిమానుల‌కు తీర‌ని క్షోభ‌ను మిగిల్చార‌ని మండిప‌డుతున్నారు. పైగా చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా తానున్నానంటూ ష‌ర్మిల అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డాన్ని వైఎస్సార్ అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

45 Replies to “తోడ‌ల్లుళ్లు క‌లుసుకున్నారు.. తోడ‌బుట్టినోళ్లు కొట్టుకుంటున్నారు!”

    1. ముందు మన పుట్టుక సక్రమమైతే వేరే వాళ్ల పుట్టకలు సక్రమంగానే కనిపిస్తాయి.

  1. తోడబుట్టినోళ్లలో ఎవరోఒకరు రాజకీయాలు వదిలేస్తే మరల కలుస్తారు.

  2. ఏం కాదులెండి సార్.. వీళ్ళు కూడా మూడు దశాబ్దాల తర్వాత కలిసిపోతారులెండి

  3. మనం ద్వేషించే మనుషులచేత పొగిడించుకోవడం అనేది నిజజీవితం లో జరగడం అరుదు. సిబియన్ ఇస్ రియల్లీ గ్రేట్.

  4. CBN and Daggubati fought with each other politically.

    They maintained dignity.

    Jag-an and Sh-armila fight is for the ill-gotten money.

    Earned during the rule of their corrupt Dad Maha-Metha.

  5. ఆ ఆస్తులు ఏమో జగన్ రెడ్డి సొంత తెలివి, కష్టం తో సంపాదించిన్వి కాదు.

    జగన్ రిక్షా తొక్కి ,సిమెంట్ బస్తాలు మోసి ఆ కూలీ డబ్బుతో ఆ డబ్బు రాలేదు.

    తండ్రి సి*ఎం పదవి నీ అడ్డం పెట్టుకుని క్వి*డ్ అండ్ *ప్రో పద్ధతిలో వ్యాపారులను బెది*రించి , లోబర్చుకుని సంపాదించినా ఆస్తులు అవి. అందుకే వాటిని తం*డ్రి కోరినట్లు తనకి కూడా వాటా కావాలి అని కూతురు అడిగింది.

    హిం*దూ సంప్రదా*యం ప్రకారం స్త్రీ ధనం మీద మగ వాడు కి హక్కు లేదు.

    ఆడ*వారికి ఇచ్చిన ఆస్తు*లు తిరిగి అడి*గేవాడిని తెలుగు ప్రజ*లు కొ*జ్జా అని పిలు*స్తాడు. మరి గ్రే*ట్ ఆం*జ్ధ లె*క్కలో ఏ*మో అంటా*రో మరి.

  6. యాక్క్.. దూ.

    అదొ*ల్ల ఆస్తులు కాజేసిన కొ*జ్జా.

    ఆ కొజ్జ్జ్* పడేసిన బి*చ్చం కోసం వాడికి సపోర్ట్ చేస్తున్న సి*గ్గు లేని గ్రే*ట్ ఆం*ధ్ర.

  7. కన్న తల్లి , సొంత చెల్లి మీద ఇలా కక్ష సాధింపుకి దిగడం మాత్రం మరీ నీచo GA….నీ అతి తెలివి తో దాన్ని కూడా noramalise చేయాలని చూడకు….జనం వ వుస్తారు…..

  8. YS Sharmila: మేనకోడలు, అల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్‌ మామయ్య కుట్రలు

    .

    తన సొంత మేనకోడలు, అల్లుడికి వెన్నుపోటు పొడిచిన వైఎస్‌ జగన్‌ నీతి మాటలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను.. తన పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు.

  9. YS Sharmila: మేనకోడలు, అల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్‌ మామయ్య కుట్రలు

    .

    తన సొంత మేనకోడలు, అల్లుడికి వెన్నుపోటు పొడిచిన వైఎస్‌ జగన్‌ నీతి మాటలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను.. తన పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు.

  10. YS Sharmila: మేనకోడలు, అల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్‌ మామయ్య కుట్రలు

    .

    తన సొంత మేనకోడలు, అల్లుడికి వెన్నుపోటు పొడిచిన వై.-.ఎస్‌ జగన్‌ నీతి మాటలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను.. తన పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు.

  11. Y.-.S Sharmila: మేనకోడలు, అల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్‌ మామయ్య కుట్రలు

    .

    తన సొంత మేనకోడలు, అల్లుడికి వెన్నుపోటు పొడిచిన వై.-.ఎస్‌ జగన్‌ నీతి మాటలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని వై.-.ఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను.. తన పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు.

  12. మంచో.. చెడో.. సూర్పణఖ లాంటి చెల్లెలి ఆత్మాభిమానం కోసం.. తన రాజ్యాన్ని, తన వంశాన్ని ఫణం గా పెట్టాడు అన్న రావణాసురుడు..

    రాక్షసుల్లో కూడా కుటుంబాలు, బంధాలు, అభిమానాలు, ఆత్మాభిమానాలు, ప్రేమలు, త్యాగాలు ఉంటాయి అని తెలుస్తోంది..

    ..

    వీడు …

    ఛీ..

    వీడి గురించి కామెంట్స్ రాయడం కూడా నాకు అసహ్యం గా ఉంది..

  13. కొట్టేసిన ఆస్తులకోస0, కత్తులతో పొడుచుకునే0త ద్వేషం వున్నా కూడా నవ్వుతూ ఎలా ముద్దులుపెట్టుకోవాలో

    “ఇడుపులపాయ అమ్మా ‘కొడుకులని” చూసి నేర్చుకోవాలి

  14. NTR ఇచ్చిన హక్కుతో ఆడబిడ్డ షర్మిల కి కూడా తండ్రి ఆస్థిలో సమాన వాటా వస్తుంది.. So అక్కా, నీ “లంగా 11అన్న” ధర్మంగా ఇస్తే ఓకే లెకపోతే చట్టం సహాయం తో బెంగళూరులో ఉన్న ప్యాలెస్, మంత్రి స్క్వేర్, బన్నేరుగట్ట రోడ్డు లో ఉన్న షాపింగ్ మాల్స్ అన్నీ స్వాధీనం చేసుకోవాలి.

  15. ఎవడో ఎంపీ గా పోటీ చెయ్యడం కోసం సొంత చిన్నాన్ననేగొడ్డలితో వేసేసి, అక్రమ ఆస్తుల కోసం కన్న తల్లి మీదే కేసులు పెట్టి వేధించే బజార్ L ‘కొడుకు.. వీడూ ఒక నాయకుడా?? పబ్లిక్కి ఏం మెసేజ్ ఇస్తున్నావ్ రా నువ్వు??

  16. బొక్క లో ఉన్న A1అన్న కోసం ఎన్నోవేల కిలోమీటర్లు

    “పాదాల మీద నడిచి” పార్టీని నిలబెట్టి, ఊరురూ తిరిగి ప్రచారం చేసి కుర్చీ ఎక్కిస్తే పెళ్ళాం & పెళ్ళాం రంకు మొగుడి మాటలు విని కష్టపడిన చెల్లెకి కనీసం ఓ పదవి ఇవ్వకుండా, ఆస్తులూ ఇవ్వకుండా వాళ్ళు చరిత్ర బైట పెడతా అన్న పాపానికి గోడకి కొట్టి, తన్ని, బైటకి తరిమేసిన ఈడూ ఓ నాయకుడే నా??

  17. ప్యాలస్ పులకేశి గాడి దగ్గర నెల నెల వెబ్సైట్ బిల్ డబ్బు తీసుకునే టైమ్ లో వెంకట్ రెడ్డి గారి ముఖ్ణం లో ఫీలింగ్ చూడాలి.

  18. ఫ్రె*ష్ శ*వం వాసన పీల్చి చాలా రోజులు అయ్యింది.

    -ప్యాలస్ పులకేశి మనోగతం.

    చుట్టుపక్కల వాళ్ళు అదిరి పోతున్నారు, ఎప్పుడు వీడు కన్ను తన మీద పడిద్దో అని.

    1. నాన్నా చిన్నన లని లేపేసి,

      అదే ఊపులో అదే రకంగా

      అమ్మని కూడా లేపెద్దాం అని ట్రై చేస్తే చివరి క్షణాల్లో చెల్లి సాయంతో అమెరికా పారిపోయి తప్పించు కున్నది.

  19. జగ*న్ వున్న బఠా*ణీ గింజ అంత బద్ద*కం మ*ట్టి మెదడు తో ఈ ఆస్తు*లు రాలేదు.

    అప్పట్లో తండ్రి కి వున్న పదవి నీ అడ్డ పెట్టుకుని జనాలని బెదిరిం*చి పోగేసి*న అక్ర*మ ఆ*స్తులు అవి.

    వాటిని సొంత తల్లి, చెల్లి తో పంచుకోడానికి వాడికి అంత పిసి*నారి తనం ఎందుకో మరి.

  20. Andaru alanti valle..swalabam kosam emayina chese type…dhaggubati enduki ntr ni vadili babu side vachadu..malli back enduki velladu..then enduku jai jagan annadu..malli jai babu annadu

  21. అక్కడ ఇష్టం లేకపోతే ఎవరి తీరు వాళ్ళు వున్నారు. కానీ ఇక్కడ గోడకేసి బాదటం, పీకలు కోయటాలు, నరకటాలు వున్నాయి కదా.

Comments are closed.