ఇంకా బాబు సీరియ‌స్ కాలేదా?

అధికార పార్టీ నేత‌ల చెడు గురించి ప్ర‌భుత్వ మీడియా రాస్తోందే త‌ప్ప‌, మ‌రే ఉద్దేశం క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు సీరియ‌స్ కావ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మా?

అధికారం అనేది క‌ళ్ల‌కు పొర‌లు క‌మ్మేలా చేస్తుంది. అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధి అనే ఆలోచ‌న‌, విచ‌క్ష‌ణ మ‌రిచేలా చేస్తుంది. ఏమైనా చేయొచ్చ‌నే లెక్క‌లేని త‌నాన్ని ప్ర‌ద‌ర్శించేలా చేస్తుంది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే… తాజాగా ప‌ల్నాడు జిల్లా న‌ర‌సారావుపేట ఎమ్మెల్యే చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబు ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి వెళ్లి ర‌చ్చ‌ర‌చ్చ చేయ‌డం వ‌ల్లే మాట్లాడుకోవాల్సి వ‌చ్చింది. ఈయ‌న టీడీపీ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ఈ తొమ్మిది నెల‌ల్లో సంబంధిత ప్ర‌జా ప్ర‌తినిధులు అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించ‌డాన్ని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు తెర‌పైకి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సీరియ‌స్ అయ్యారని ప్ర‌భుత్వ అనుకూల మీడియాకు అల‌వాటైంది.

ర‌వాణాశాఖ మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి భార్య అన్న‌మ‌య్య జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఒక సీఐ ఆల‌స్యంగా వ‌చ్చాడ‌నే కార‌ణంతో తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేవ‌లం మంత్రి భార్య‌న‌నే కార‌ణంతో రుబాబు ప్ర‌ద‌ర్శించార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో మంత్రితో సీఎం బాబు ఫోన్‌లో మాట్లాడి ఆగ్ర‌హించార‌ని, మ‌రోసారి ఇలాంటివి పున‌రావృతం కాకూడ‌ద‌ని హెచ్చ‌రించిన‌ట్టు వార్త‌లొచ్చాయి.

ఉమ్మ‌డి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు సొంత పార్టీ నాయ‌కులు, అలాగే సొంత మీడియా ప్ర‌తినిధులతో పాటు వైసీపీకి చెందిన వాళ్ల‌పై నోటి, చేతి దురుసు ప్ర‌ద‌ర్శించారు. ఏకంగా చ‌ట్టాన్ని త‌న చేతిలోకి తీసుకుని వైసీపీ నాయ‌కుడి భ‌వనంపైకి బుల్డోజ‌ర్‌తో ఊరేగింపుగా వెళ్ల‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌పాలైంది. కొలిక‌పూడి వ్య‌వ‌హారం శ్రుతిమించ‌డంతో చంద్ర‌బాబు ఒక‌ట్రెండుసార్లు పిలిపించుకుని హెచ్చ‌రించార‌ని మీడియాలో వార్త‌లు రావ‌డం గురించి అంద‌రికీ తెలిసిందే.

ఈ మ‌ధ్య దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఒక పెళ్లి వేడుక‌లో వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి కారు డ్రైవ‌ర్‌పై ప్ర‌వ‌ర్తించిన తీరు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఇలాగైతే ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని, చింత‌మ‌నేనిపై బాబు అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించార‌నే వార్త‌ల్ని చ‌దివాం.

ఇటీవ‌ల ఫైబ‌ర్‌నెట్ ఎండీ దినేశ్‌కుమార్, మ‌రో ముగ్గురు ఉద్యోగుల తీరుపై చైర్మ‌న్ హోదాలో జీవీరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆ సంద‌ర్భంలో కూడా జీవీరెడ్డిని పిలిపించుకుని చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఇలా అన్ని సంద‌ర్భాల్లోనూ చంద్ర‌బాబు అరాచ‌కాల్ని, క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంగిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటార‌నే సానుకూల సందేశాన్ని, సంకేతాన్ని పంపాల‌ని టీడీపీ అనుకూల మీడియా తాప‌త్ర‌య ప‌డుతోంది. కానీ కూట‌మి ప్ర‌జా ప్ర‌తినిధుల దోపిడీ, అరాచ‌కాలు మాత్రం ఆగ‌లేదు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌…. అధికార పార్టీకి చెందిన న‌ర‌సారావుపేట ఎమ్మెల్యే ఎక్సైజ్ క‌మిష‌న‌రేట్‌లో చేసిన ర‌చ్చ‌.

జ‌న‌సేన ప్ర‌జా ప్ర‌తినిధులేమీ త‌క్కువ తిన‌లేదు. కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక మెడిక‌ల్ కాలేజీ ప్రొఫెస‌ర్‌పై ప్ర‌ద‌ర్శించిన నోటి దురుసుకు పౌర స‌మాజం అవాక్కైంది. బ‌య‌టికి రానివి ఇంకెన్నో. స‌మాజం దృష్టిలో ప‌డిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబు, ప‌వ‌న్ సీరియ‌స్ అయ్యార‌న‌డం, ఆ త‌ర్వాత కూట‌మి నేత‌ల తీరు ష‌రా మామూలే. కేవ‌లం చంద్ర‌బాబును మంచిగా చూప‌డానికి, అధికార పార్టీ నేత‌ల చెడు గురించి ప్ర‌భుత్వ మీడియా రాస్తోందే త‌ప్ప‌, మ‌రే ఉద్దేశం క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు సీరియ‌స్ కావ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మా? ఏవైనా చ‌ర్య‌లు తీసుకునే ప‌రిస్థితి వుందా? అనే ప్ర‌శ్న ఏపీ పౌరుల మెద‌ళ్ల‌ను తొలుస్తోంది. ఎందుకంటే నిజంగా చంద్ర‌బాబు అంటే భ‌యం ఉంటే ఇంత ప‌బ్లిక్‌గా జ‌నాల‌ను, ప్ర‌భుత్వ అధికారుల‌ను హింసించారు క‌దా అని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. చూడాలి ఇవాళ అధికార పార్టీ మీడియా ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చిన సీఎం అని హైడ్‌లైన్ రావ‌చ్చు.

5 Replies to “ఇంకా బాబు సీరియ‌స్ కాలేదా?”

  1. ఇలాంటి ఏటకారాలు మింగే 11 కి పడి పోయారు.జగన్ ఎదవ ల కోకు కాబట్టే ఎవడు ఎలా ప్రవర్తిస్తున్నా చూస్తూ కూర్చున్నాడు..ఇప్పుడు పిసు..కుంటున్నాడు.

  2. ఒరేయ్ గ్యాస్ ఆంధ్ర

    ఇలాంటి పనికిమాలిన రాతలు నీ హయాంలో కొన్ని వందలు వేలు రాసి ఉంటావు. వైసీపీకి అనుకూలంగా ఇతర పక్షులకు ప్రతికూలంగా ఎన్నో పోస్టులు పెట్టావు నీ పోస్ట్ ఒకటి కూడా పనిచేయలేదు రా గ్యాస్ ఆంధ్ర

    ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా నీ రాతలతో దక్కించుకోలేకపోయావు అటువంటి అప్పుడు ఇటువంటి బోడి రాతలు ఎందుకు రాయాలి

    అధికారం అనే అహంకారపు పొరలు తమ్మి మీ వాళ్ళు కూచిన గాడిద కూతలు చేసిన గాడిద పనులకు పంగనామాలు దక్కాయి. కనీసం అసెంబ్లీ మొఖం కూడా చూడలేకపోతున్నారు. అప్పుడు ఇటు వంటి రాతలు రాయడంలో అర్థం లేదురా

Comments are closed.