భర్తతో ఇష్యూ లేదు.. గాయని వీడియో

న్యూస్ లో నా గురించి, నా భర్త గురించి తప్పుగా రాస్తున్నారు. దానిపై క్లారిటీ కోసం ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. నాకు, నా భర్తకు మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు

అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ప్రాణం మీదకు తెచ్చుకున్న గాయని కల్పన, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికొచ్చిన తర్వాత ఆమె వీడియో పెట్టారు. తను ఆరోగ్యంగా ఉన్నానని తెలుపుతూనే, భర్తతో తనకు విభేధాలున్నాయంటూ వస్తున్న మీడియా కథనాల్ని ఖండించారు.

“న్యూస్ లో నా గురించి, నా భర్త గురించి తప్పుగా రాస్తున్నారు. దానిపై క్లారిటీ కోసం ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. నాకు, నా భర్తకు మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు. నేను బతికి తిరిగి ఇలా మీ ముందుకు వచ్చానంటే దానికి నా భర్త కారణం. టైమ్ కు నన్ను కాపాడారు. దేవుడు నాకిచ్చిన మంచి వ్యక్తి నా భర్త.”

45 ఏళ్ల వయసులో తను పీహెచ్డీ చేస్తున్నానని… ఎల్ఎల్బీ కూడా చదువుతున్నానని.. మరోవైపు సంగీత రంగంలో రాణిస్తున్నానని.. ఇన్ని పనులు చేయడానికి తన భర్త అందిస్తున్న ప్రోత్సాహమే కారణమని స్పష్టం చేశారు కల్పన. ఒత్తిడి వల్లనే ఇదంతా జరిగిందన్నారు.

“ఇన్ని పనులు చేయడం వల్ల నాపై ఒత్తిడి పెరిగింది. చాలా ఏళ్లుగా నాకు నిద్ర పట్టడం లేదు. ఇన్సోమ్నియాకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాను. ఆ పిల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది.”

తను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని, త్వరలోనే పాటలతో తిరిగి అలరిస్తానని అన్నారు కల్పన.

5 Replies to “భర్తతో ఇష్యూ లేదు.. గాయని వీడియో”

  1. సొంత బిడ్డతో ప్రశాంతంగా లైఫ్ లీడ్ చెయ్యక ఆమెను గాలికి వదిలేసి, “గొఱ్ఱె బిడ్డ” ని నమ్మి పెళ్లి చేసుకుంటే నిద్రపట్టక ఇప్ప్పుడు ఇలా అయ్యింది next టైం ఇంకా ఎమౌతుందో??

Comments are closed.