పవన్‌కు ఈజీనే.. చంద్రబాబుకే చాలా కష్టం!

జనసేనాని పవన్ కళ్యాణ్‌కు చాలా చాలా ఈజీగా, చిటికెలో అయిపోయింది. అదే చంద్రబాబు విషయానికి వస్తే, మీనమేషాల లెక్క ఇంకా పూర్తి కావడమే లేదు.

జనసేనాని పవన్ కళ్యాణ్‌కు చాలా చాలా ఈజీగా, చిటికెలో అయిపోయింది. అదే చంద్రబాబు విషయానికి వస్తే, మీనమేషాల లెక్క ఇంకా పూర్తి కావడమే లేదు. ఎమ్మెల్యేల కోటాలో ఐదుగురిని శాసనమండలికి పంపగల అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇందుకు సంబంధించిన కసరత్తు తెలుగుదేశం పార్టీలో ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పవన్ కళ్యాణ్ సునాయాసంగా తమ పార్టీకి చంద్రబాబు ఇవ్వబోయే ఒక్క ఎమ్మెల్సీ సీటుకు అన్నయ్య నాగబాబును నామినేషన్ వేయాలని పురమాయించేశారు. కానీ చంద్రబాబుకు అంత ఈజీగా తేలడం లేదు.

ఐదు ఎమ్మెల్సీ సీట్లు ప్రస్తుతం కూటమి పార్టీలకు చెందినవిగా మారనుండగా, ఒక్క సీటు జనసేనకు దాదాపుగా ఖరారైంది. మిగిలిన నాలుగు బీజేపీకి ఇస్తారా లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. తెలుగుదేశం ఈ దఫా మూడు తీసుకున్నా, నాలుగు తీసుకున్నా, వాటిని ఆశావహుల మధ్య సర్దుబాటు చేయడం చంద్రబాబుకు తలకుమించిన భారం అవుతోంది. నిజానికి ఈ ఎంపిక బాధ్యత ప్రస్తుతం లోకేష్ చేతిలో ఉంది. అయితే అధికారిక ముద్ర మాత్రం చంద్రబాబుద్వారానే రావాలి. అందుకే పార్టీలోని ఆశావహులంతా ఈ తండ్రీకొడుకుల చుట్టూ తిరుగుతున్నారు.

చాలా జిల్లాల్లో ఒకరికంటే ఎక్కువ మంది నేతలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం ఆరాటపడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. “పార్టీ కోసం మేం కష్టపడ్డాం” అనే నినాదంతో, తమ హక్కును చాటుకునే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. చంద్రబాబునాయుడు ఇప్పటిదాకా నామినేటెడ్ పదవుల పంపిణీని కూడా పూర్తిచేయలేదు. అధికారంలోకి వచ్చి ఇంకో మూడు నెలల్లో సంవత్సరం పూర్తవుతున్నా, ఇంకా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంలో చంద్రబాబు ఎందుకు జాప్యం చేస్తున్నారనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక డెడ్‌లైన్ ఉండటంతో చంద్రబాబు అభ్యర్థులను తేలుస్తారు. లేకపోతే ఆ ఎంపికను కూడా ఏళ్ల తరబడి సాగదీస్తారన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ చాలా సునాయాసంగా చేయగలిగిన పని, చంద్రబాబుకు చాలా ఆలస్యం అవుతోంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత, మూడు కేబినెట్ ఖాళీలను భర్తీ చేసే విషయంలో ఒకటి నాగబాబుకు దక్కడం ఖరారే కదా! మరి మిగిలిన రెండు పోస్టులకు చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.

12 Replies to “పవన్‌కు ఈజీనే.. చంద్రబాబుకే చాలా కష్టం!”

  1. ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా…. పిఠాపురం వర్మ కి మాత్రం న్యాయం చేయాలి ఈ సారి

    1. వర్మ కంటే ఇంకా చాలా మంది ఉన్నారు టీడీపీ లో నయం కావల్సినోళ్లు.

      దేవినేని ఉమా , బుద్ధా వెంకన్న , P సునీతా గారు , ఇంకా చాల మంది సీనియర్లు

      1. ఆయనకి రావాల్సిన టికెట్ లాస్ట్ మినిట్ లో y cp నుంచి వచ్చిన వసంత ప్రసాద్ కి ఇచ్చారు.

  2. ఇంకా రాయ్, 2029 మ్మెల్యే ఎన్నికల లో జగన్ కు చాలా లాభం, 2034 ఎంపీ ఎన్నికల లో జగన్ కు చాలా లాభం, టీడీపీ కి నష్టం.

    1. సర్ ఏ మనిషైనా సుఖం గ బతకాలనుకొంటాడు ఆల్రెడీ జగన్ గారు వేల కోట్లు నొక్కేసేడు us uk లలో కొంత పెట్టుబడి పెడితే వాళ్ళు ఈయనకు వీసా ఇచ్చేస్తే పోతాడు ఇక మిగిలిపోయింది మేజువాణి బృందం రోజా నానీలు వంశి అంబటి కోడిగుడ్డు గార్లను paytm వాళ్ళను ఏ పార్టీ తీసుకోదు వీళ్లకు శ్రీ రెడ్డి గారే దారి చూపించాలి

Comments are closed.